యాంకర్, సినీనటి విష్ణుప్రియ తీవ్ర ట్రోలింగ్ ఎదుర్కుంటోంది. బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంటర్ అవ్వడమే ఆమె చేసిన తప్పుగా పరిగణిస్తున్నారు నెటీజన్లు. బిగ్‌బాస్ సీజన్-8లో వన్ ఆఫ్ ది కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన విష్ణుప్రియ గతంతో ఇదే షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. బిగ్‌బాస్ షో కాన్సెప్టే అసలు తనకు నచ్చదని, కోట్లు ఇచ్చినా ఆ హౌస్‌లోకి వెళ్లనని చెప్పింది.
https://x.com/kishorekish13/status/1830442067740278919
కట్‌చేస్తే.. బిగ్‌బాస్ షోపై ఆ వ్యాఖ్యలు చేసిన తరువాత నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా విష్ణుప్రియ ఎంట్రీ ఇచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 4లో ఓ యూట్యూబ్ ఛానల్ వాళ్లు యాంకర్ విష్ణుప్రియని బిగ్‌బాస్ షోపై అభిప్రాయం అడిగారు. ‘బిగ్ బాస్ కాన్సెప్టే నాకు నచ్చదు. ఆ కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, ఎలిమినేషన్ అంటే నాకు ఇష్టం ఉండదు. అలాంటి షోకి డబ్బులు ఇస్తున్నారంటే ఎందుకు పోతా? లక్షలు కాదు.. ఎన్నికోట్లు ఇచ్చినా నేను బిగ్ బాస్ షోకి కంటెస్టెంట్‌గా వెళ్లను. బయట ప్రపంచం ఇంత అందంగా ఉన్నప్పుడు ఒక హౌస్‌లోకి వెళ్లి బంధీగా ఎందుకు ఉండాలి. మీ ఇళ్లు ఫ్యామిలీ ఇవన్నీ ఉన్నాయి కదా.. నేను బిగ్‌బాస్ పర్సన్‌ని కాదు.. చిన్నప్పటి నుంచి కూడా నేను బిగ్ బాస్ షో చూడలేదు. ఇలాంటి షోని నేను ఎంకరేజ్ చేయను అని విష్ణు ప్రియ కామెంట్స్ చేసింది. పాత వీడియో తాజాగా ఆమె షోలో అడుగుపెట్టిన నేపథ్యంలో వైరల్ అవుతోంది. కోట్లు ఇచ్చినా వెళ్లనని చెప్పి.. సీజన్ 8లో ఎందుకు ఎంట్రీ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు.
కాగా, బిగ్‌బాస్ సీజన్-8లో కంటెస్టెంట్ల రెమ్యూనరేషన్లలో అత్యధికంగా విష్ణుప్రియ అందుకుంటోందని, వారికి ఆమెకు మూడున్నర లక్షల రూపాయల పైమాటే అని ప్రచారం సైతం జరుగుతోంది.