హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) పరిధిలోని 51 గ్రామాలను సమీప మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. రంగారెడ్డి, సంగారెడ్డి, మల్కాజిగిరి, మేడ్చల్ తదితర జిల్లాల్లోని పలు గ్రామాలు ఈ జాబితాలో ఉన్నాయి. ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం విలీనమవుతున్న గ్రామాల వివరాలు మున్సిపాలిటీల వారీగా ఇలా ఉన్నాయి.
బాచారం, గౌరెల్లి, కుత్బుల్లాపూర్, తారామతి పేట పంచాయతీలు పెద్ద అంబర్‌పేట మున్సిపాలిటీలో విలీనం కానున్నాయి. ఇక బహదూర్‌గూడ, పెద్ద గోల్కొండ, చిన్న గోల్కొండ, హమీదుల్లా నగర్, రషీద్ గూడ, ఘంసీమిగూడ పంచాయతీలు శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనమవుతున్నాయి. పూడూరు, రాయిలాపూర్ గ్రామ పంచాయతీలు మేడ్చల్ మున్సిపాలిటీలోను.. కీసర, యాదగిరిపల్లి, అంకిరెడ్డిపల్లి, చీర్యాల, నర్సపల్లి, తిమ్మాయిపల్లి పంచాయతీలు దమ్మాయిగూడ మున్సిపాలిటీలోను విలీనం కానున్నాయి. ఇక మీర్జాగూడ పంచాయతీ నార్సింగి మున్సిపాలిటీలో, హర్షగూడ పంచాయతీ తుక్కుగూడ మున్సిపాలిటీలో విలీనమవుతున్నాయి.
ఇక మునీరాబాద్, గౌడవెల్లి పంచాయతీలు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో.. బొంరాసిపేట, శామీర్ పేట, బాబాగూడ పంచాయతీలు తూంకుంట మున్సిపాలిటీలో విలీనం కానున్నాయి. బోగారం, గోదాముకుంట, కరీంగూడ, రాంపల్లి దాయార గ్రామాలు నాగారం మున్సిపాలిటీలో.. వెంకటాపూర్, ప్రతాపసింగారం, కొర్రెముల, కాచివానిసింగారం, చౌదరిగూడ పంచాయతీలు పోచారం మున్సిపాలిటీలో విలీనమవుతున్నాయి. ఇక అంకుషాపూర్, ఔషాపూర్, మాదారం, ఏదులాబాద్, ఘనాపూర్, మర్పల్లిగూడ పంచాయతీలు ఘట్కేసర్ మున్సిపాలిటీలో విలీనం కానున్నాయి.