YouTube channel subscription banner header

అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు.. ఇదీ చంద్రబాబు నైజం..!

Published on

చంద్రబాబు నాయుడు రాజకీయాలలో ఎప్పుడు ఎలా మారాలో బాగా తెలిసిన దిట్ట. అందితే జుట్టు.. అందకుంటే కాళ్లు పట్టుకునే వైనం ఆయనది. అవసరం కోసం ఎవరి వద్దకైనా వెళ్లడం, అవసరం లేనప్పుడు తిట్టిపోయడం ఆయనకు అలవాటే. ఇటీవల ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో ఆయన ప్రవర్తన ఈ విషయానికి ఒక ఉదాహరణ.

గతంలో చంద్రబాబు ప్రశాంత్ కిషోర్ ను “బీహార్ బందిపోటు” అని తిట్టిపోశారు..ఆయన ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్లను చేర్పించారని ఆరోపించారు. హైదరాబాద్ లోని టీడీపీ డేటాను చోరీ చేశారని దుమ్మెత్తిపోశారు. కానీ ఇటీవల చంద్రబాబు మనసు మార్పుకున్నారు. ఆరోజు తిట్టిన నోటితోనే.. మళ్లీ స్తుతించడం మొదలుపెట్టారు. త్వరలో ఏపీలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చంద్రబాబు.. రాష్ట్రంలో మద్దతు కోసం ప్రశాంత్ కిషోర్ ను ఆశ్రయించారు.లోకేష్ ద్వారా ప్రత్యేక విమానంలో విజయవాడకు రప్పించుకున్నారు.బిజెపి ఎంపీ సిఎం రమేష్ విమానం ద్వారా ప్రయాణం ఏర్పాటు చేశారు. వారి మధ్య ఎలాంటి డీల్ కుదిరింది అనే విషయం బయటకు రాలేదు కానీ.. ప్రశాంత్ కిశోర్ మాత్రం.. తాను నిరాకరించినట్లు బయటకు చెప్పేశారు.

చంద్రబాబు తిట్ల గురించి ఓ టీవీ చానెల్‌ ప్రతినిధి గుర్తు చేయగా.. ప్రశాంత్ కిశోర్ మాత్రం చాలా సింపుల్ గా తీసుకున్నారు. చంద్రబాబు ఓటమితో కోపం రావడం సహజమని అన్నారు.తనకు సాయం చేయాలని చంద్రబాబు కోరారని, తాను నిరాకరించానని చెప్పారు.
రాజకీయాల నుండి తాను దూరంగా ఉంటున్నానని, జగన్ లేదా ఇతరులకు మద్దతు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు.

ఇక చంద్రబాబులో ఓటమి భయం రోజు రోజుకీ పెరిగిపోతోంది, దాని కోసం ఆయన చేయని ప్రయత్నమంటూ లేదు. ఓటమి భయంతో ప్రత్యర్థులతో పొత్తులు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు.రాజకీయ నైతికతను పక్కన పెట్టి అధికారం కోసం ఎంతకైనా తెగించే వ్యక్తిగా ముద్ర వేసుకుంటున్నారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీని కూడా తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. బిజెపికి వ్యతిరేకంగా పనిచేశారు. ఇప్పుడు బిజెపితో కాళ్లబేరానికి సిద్ధపడుతున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...