YouTube channel subscription banner header

పవన్ కవరింగ్ స్టోరీ అట్టర్ ఫ్లాప్..!

Published on

సెప్టెంబర్-2 పవన్ కల్యాణ్ పుట్టినరోజు.
పుట్టినరోజున ఆయన ఎవరికీ అందుబాటులో ఉండరని.. ఇటీవల కేబినెట్ మీటింగ్ లో ముందస్తు బర్త్ డే విషెస్ చెప్పారు మంత్రులు.
ఆరోజు ఆయన కుటుంబానికి సమయం కేటాయించడాన్ని కూడా ఎవరూ తప్పుబట్టరు. అయితే అనుకోని వరదలు విజయవాడ, గుంటూరుని ముంచేశాయి. అలాంటి టైమ్ లో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కచ్చితంగా ఫీల్డ్ లోకి వస్తారని అందరూ అనుకున్నారు. సీఎం చంద్రబాబు కూడా బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కి వెళ్లకుండా విజయవాడలోనే మకాం వేశారు. కానీ పవన్ మాత్రం రాలేదు. ఆగస్ట్ 31వతేదీ వర్షాలు మొదలైతే.. పవన్ ఏపీ ప్రజలకు సెప్టెంబర్-3 సాయంత్రం దర్శనమిచ్చారు. నాలుగు రోజుల తర్వాత తీరిగ్గా బయటకు వచ్చిన ఆయన తాను సహాయక కార్యక్రమాల్లో పాల్గొనకపోవడానికి విచిత్రమైన కారణం చెప్పారు. ఒకసారి చెబితే జనం నమ్మట్లేదని, మళ్లీ ఈరోజు అదే విషయం చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టారు. వరదల సమయంలో జనసేనాని జనంలోకి రాకపోవడం సంచలనంగా మారిన సమయంలో ఆయన చేసిన కవరింగ్ ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోవడం విశేషం. పోనీ ఫీల్డ్ లోకి రాలేదు సరే, కనీసం ఆఫీస్ లో కూడా సమీక్షలు నిర్వహించలేదు కదా అనేది వైసీపీ లాజిక్. దానికి పవన్ వద్ద సమాధానం లేదు.

https://x.com/JanaSenaParty/status/1831249701963808826

వరద ప్రభావిత ప్రాంతాలకు డిప్యూటీసీఎం హోదాలో పవన్ ఎందుకు వెళ్లలేదని వైసీపీ పదే పదే నిలదీస్తోంది. వరదలొచ్చాక నాలుగు రోజుల తర్వాత మీడియా ముందుకొచ్చిన పవన్ ఈ విషయంపై ఓ సారి క్లారిటీ ఇచ్చారు. తాను బయటకు వస్తే జనం తనను చూడటానికి ఎగబడతారని, తోసుకుంటూ ముందుకొస్తారని, గందరగోళం నెలకొంటుందని, అందుకే తాను బయటకు రావడం లేదని చెప్పుకొచ్చారు. మరోసారి అదే విషయం చెప్పేందుకు ఆయన మీడియా ముందుకొచ్చారు. తాను వెళ్తే సహాయక చర్యలకు ఇబ్బంది ఏర్పడుతుందని, అందుకే బయటకు రావడం లేదని అన్నారు. కావాలంటే వైసీపీ నేతలు తనతో రావొచ్చని, తన కాన్వాయ్ లో వారిని తీసుకెళ్తానని, అప్పుడు వారు పరిస్థితుల్ని ప్రత్యక్షంగా చూడొచ్చని అన్నారు. ఇంట్లో కూర్చుని విమర్శలు చేయకుండా బయటకు వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన వైసీపీ శ్రేణులకు సూచించారు.

ఆక్రమణల వల్లే నష్టం..
వరద సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయని, సీఎం చంద్రబాబు సమర్థంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయన్ను అభినందించాల్సిందిపోయి విమర్శలు చేయడం వైసీపీ నేతలకు సరికాదన్నారు. బుడమేరులోని 90 శాతం ఆక్రమణలే విజయవాడకు శాపంగా మారాయని, వాటన్నిటినీ తొలగించాల్సిన అవసరం ఉందన్నారు. సహాయ కార్యక్రమాల్లో పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బంది పాల్గొంటున్నారని, 175 బృందాలు విజయవాడలో పనిచేస్తున్నాయన్నారు. వరద ప్రభావం లేని జిల్లాల నుంచి 900 మంది పారిశుద్ధ్య సిబ్బందిని పిలిపించామన్నారు. 26 ఎన్డీఆర్‌ఎఫ్‌, 24 ఎస్డీఆర్ఎఫ్‌ బృందాలు పనిచేస్తున్నాయని చెప్పారు. ఈ లెక్కలన్నీ బాగానే చెబుతున్నారు కానీ, నేరుగా జనంలోకి వచ్చేందుకు మాత్రం డిప్యూటీసీఎం వెనకడుగు వేస్తున్నారు. తీరిగ్గా ఇప్పుడు బయటకు వస్తే కచ్చితంగా ప్రజలు నిలదీసే అవకాశముందని పవన్ అనుమానిస్తున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...