YouTube channel subscription banner header

గోదావరి ఉగ్రరూపం.. శాంతించిన కృష్ణమ్మ

Published on

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు తగ్గి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న ఈ దశలో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో నదుల్లోకి వరదనీరు రావడం ఆందోళనకరంగా మారింది. అటు గోదారమ్మ ఉగ్రరూపం దాలుస్తోంది. గోదావరిలో వరద ప్రవాహం మరింత పెరిగింది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత నీటిమట్టం 11 అడుగులకు చేరుకుంది. ఇక్కడి నుంచి సముద్రంలోకి 8.80 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అటు భద్రాచలం వద్ద కూడా గోదావరికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. నీటిమట్టం 44.3 అడుగులుగా ఇక్కడ నమోదైంది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. భద్రాచలం నుంచి దిగువకు 9,74,666 క్యూసెక్కుల వరద ప్రవాహం వెళ్తోంది. గోదావరి పరిసర ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

శాంతించిన కృష్ణమ్మ..
ఏపీని వణికించిన కష్ణమ్మ ఇప్పుడిప్పుడే శాంతిస్తోంది. నాలుగు రోజులుగా ఉగ్రరూపం దాల్చిన కృష్ణానదిలో వరద ప్రవాహం తగ్గుతోంది. ప్రకాశం బ్యారేజీ వద్ద గరిష్టంగా 11 లక్షల క్యూసెక్కులు దాటిన వరద ప్రవాహం క్రమంగా తగ్గిపోయింది. ప్రస్తుతం మూడు లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. గత రెండు రోజుల్లోనే ఎనిమిది లక్షల క్యూసెక్కుల వరకు ప్రవాహ తీవ్రద తగ్గింది. ప్రస్తుతం ప్రమాద హెచ్చరికలను అధికారులు ఉపసంహరించుకున్నారు.

విజయవాడలో నీటమునిగిన ప్రాంతాల్లో ఇప్పుడు సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. వరద తగ్గిన వెంటనే బురదను శుభ్రం చేసే పని మొదలు పెట్టారు. సింగ్ నగర్ వాసులంతా తిరిగి ఇళ్లకు చేరుకున్నారు. పంట పొలాలు మాత్రం ఇంకా నీటమునిగే ఉన్నాయి. లంక గ్రామాల్లో కొన్నిచోట్ల విద్యుత్ సేవలు పునరుద్ధరించలేదు.

మరోవైపు ప్రకాశం బ్యారేజ్‌ లో దెబ్బతిన్న 67, 68, 69 నెంబర్‌ గేట్లకు మరమ్మతులు చేస్తున్నారు అధికారులు. 69వ గేటు వద్ద పడవ ఢీకొనడంతో కౌంటర్‌ వెయిట్‌ దెబ్బతింది. ఏపీ జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్యనాయుడు పర్యవేక్షణలో మరమ్మతు పనులు మొదలయ్యాయి. మూడు గేట్లకు పడవలు అడ్డుగా ఉండటంతో నీటి ప్రవాహం సక్రమంగా లేదు. ప్రవాహం మరింత తగ్గితే పడవలను తొలగిస్తామంటున్నారు అధికారులు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...