YouTube channel subscription banner header

టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలు..! వైరల్ అవుతున్న వీడియోలు

Published on

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకి చెందిన కొన్ని ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సత్యవేడు నియోజకవర్గ టీడీపీ మహిళా నేత వరలక్ష్మితో ఆయన ఓ హోటల్ లో సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకొచ్చాయి. తనను బెదిరించి ఎమ్మెల్యే లోబరచుకున్నాడని, హోటల్ గదికి పిలిచి లైంగిక దాడి చేశాడంటూ బాధితురాలు సీఎం చంద్రబాబుకి ఓ లేఖ రాశారు. సదరు వీడియోలను ఆమె చంద్రబాబుకి పంపించారు. దీంతో ఈ వ్యవహారం బయటకొచ్చింది. ఎమ్మెల్యే ఆదిమూలం వ్యవహారం సంచలనంగా మారింది.

https://x.com/TeluguScribe/status/1831573398066966816

కోనేటి ఆదిమూలం రాజకీయ జీవితం కాంగ్రెస్ తో మొదలైంది. ఆ తర్వాత ఆయన టీడీపీలో చేరారు. 2011లో వైసీపీలోకి వచ్చారు. 2014 ఎన్నికల్లో సత్యవేడు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019లో తిరిగి వైసీపీ టికెట్ పై ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ ఏడాది ఎన్నికల్లో సత్యవేడు స్థానం కాకుండా ఆయనకు తిరుపతి ఎంపీ సీటు ఆఫర్ చేశారు జగన్. దీనికి అంగీకరించని ఆదిమూలం.. టీడీపీలో చేరి సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ క్రమంలో స్థానిక టీడీపీ మహిళా నేతతో ఆయన సన్నిహితంగా ఉన్న వీడియోలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

కోనేటి ఆదిమూలం టీడీపీలో చేరి ఎమ్మెల్యే టికెట్ కి ప్రయత్నిస్తున్న సందర్భంలో సదరు మహిళా నేత అభ్యంతరం తెలిపినట్టు తెలుస్తోంది. సీఎం చంద్రబాబుకి రాసిన లేఖలో ఆ విషయాన్ని కూడా ఆమె ప్రస్తావించారు. తీరా టీడీపీ టికెట్ ఇచ్చిన తర్వాత ఆయన గెలుపుకోసం తాను కృషి చేశానన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తనను బలవంతంగా హోటల్ రూమ్ కి పిలిపించారని ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్ రూమ్ లో పెన్ కెమెరా ద్వారా అతని వికృత చేష్టలను రికార్డ్ చేశానని చెప్పిన ఆమె, వీడియోలు ఉన్న పెన్ డ్రైవ్ ని కూడా సీఎం చంద్రబాబుకి పంపించారు.

ఎన్నికల తర్వాత ఇప్పటి వరకు వైసీపీకి చెందిన వరుస వ్యవహారాలు సంచలనంగా మారాయి. వైకాపా కాదు వైకామ పార్టీ అంటూ టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే వీడియోలు ఆ పార్టీని ఇరుకున పెట్టాయి. సీఎం చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...