YouTube channel subscription banner header

టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. ఎమ్మెల్సీ లేళ్ల అరెస్టు

Published on

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరిలోని టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో అరెస్టులను వేగవంతం చేశారు పోలీసులు. ఈ కేసులో ఇప్పటికే వైసీపీ నేత, మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. తాజాగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేశారు. బెంగళూరులో లేళ్ల అప్పిరెడ్డిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు నుంచి రేపు ఉదయం మంగళగిరికి తీసుకువస్తారని సమాచారం.

2021 అక్టోబర్ 19న తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి జరిగింది. ఐతే అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ఘటనపై కేసు నమోదు చేసిన టీడీపీ.. ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, వైసీపీ నేతలు దేవినేని అవినాష్‌, నందిగం సురేష్ సహా పలువురిని నిందితులుగా చేర్చింది. ఐతే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వీరంతా హైకోర్టును ఆశ్రయించగా.. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకుంటామన్న అభ్యర్థనను సైతం కోర్టు తిరస్కరించింది.

బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించడంతో ఇదే అదునుగా అరెస్టులను స్పీడప్ చేసింది ప్రభుత్వం. ఈ కేసులో ఇప్పటికే మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అరెస్టు చేసిన పోలీసులు మంగళగిరి కోర్టులో ప్రవేశపెట్టారు. సురేష్‌కు రెండు వారాల రిమాండ్ విధించింది కోర్టు. 2014 నుంచి టీడీపీ తనను టార్గెట్ చేసిందన్న నందిగం సురేష్‌.. అందులో భాగంగానే తనపై అక్రమ కేసులు న‌మోదు చేసింద‌ని ఆరోపించారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...