మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వల్లే విజయవాడలో వరద కష్టాలు తగ్గాయని అన్నారు మాజీ మంత్రి రోజా. జగన్ తీసుకొచ్చిన వ్యవస్థలే ఇప్పుడు విజయవాడ వాసులను ఆదుకున్నాయని చెప్పారామె. జగన్ ముఖ్యమంత్రిగా లేకపోయినా ఆయన హయాంలో కొత్తగా తీసుకొచ్చిన వ్యవస్థలు, ఆయన ప్రారంభించిన పథకాలు ప్రజలకు అండగా ఉన్నాయని వివరించారు. జగన్ వల్లే వరద కష్టాలు తగ్గాయని తేల్చి చెప్పారు రోజా.
ఎలాగంటే..?
జగనన్న తీసుకొచ్చిన రేషన్ వాహనాలు
జగనన్న తీసుకొచ్చిన సచివాలయ వ్యవస్థ
జగనన్న నియమించిన వాలంటీర్ వ్యవస్థ
జగనన్న కట్టించిన రిటైనింగ్ వాల్
జగనన్న హయాంలో కొన్న 108, 104వాహనాలు
జగనన్న నియమించిన సచివాలయ ఉద్యోగులు
జగనన్న తీసుకొచ్చిన క్లీన్ ఆంధ్రా వాహనాలు
జగనన్న తీసుకొచ్చిన వై ఎస్సార్ హెల్త్ సెంట్రర్లు
ఈరోజు వరద కష్టాల నుండి విజయవాడ ప్రజలను గట్టెక్కిస్తున్నాయి… అంటూ ట్వీట్ వేశారు రోజా.
https://x.com/RojaSelvamaniRK/status/1831976827742740547
రోజాతోపాటు వైసీపీ అధికారిక సోషల్ మీడియాలో కూడా రేషన్ వాహనాల వ్యవహారంలో టీడీపీకి కౌంటర్లు పడుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చాక రేషన్ వాహనాలు అవసరం లేదని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కామెంట్ చేశారు. ఆ వాహనాల కొనుగోలులో గోల్ మాల్ జరిగిందని దానిపై విచారణ జరుపుతామన్నారాయన. అయితే వరదల సమయంలో ఆ వాహనాల్లోనే నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. ఇతరత్రా అవసరాలకు కూడా వాటినే ప్రధానంగా వాడుకుంటున్నారు. పనికిరావు అన్నవాటిని ఎలా ఉపయోగిస్తున్నారని వైసీపీ లాజిక్ తీస్తోంది. పనికి రాని వాటిని కూడా పనికొచ్చేలా చేస్తున్నామని టీడీపీ చెప్పుకుంటోంది.