YouTube channel subscription banner header

బాత్రూమ్ వీడియోలు.. తెలంగాణలోనూ కలకలం

Published on

గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ బాత్రూమ్ లో సీసీ కెమెరాలున్నాయనే వార్త ఇటీవల ఏపీలో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అది కేవలం పుకారు అని, ఎలాంటి కెమెరాలు లేవని పోలీసులు, ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడంతో ఆ గొడవ సద్దుమణిగింది. సరిగ్గా ఇలాంటి ఘటనే తెలంగాణలో జరిగింది. అయితే అక్కడ సీసీ కెమెరాలతో రికార్డ్ చేయలేదు. నేరుగా బాత్రూమ్ లోకే వచ్చిన పీఈటీ టీచర్ జ్యోత్స్న.. అమ్మాయిల వీడియోలు తీసి సైకోలా ప్రవర్తిస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. విద్యార్థినులు రోడ్డెక్కారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చివరకు ఆ పీఈటీపై చర్యలు తీసుకుంటున్నట్టు డీఈఓ ప్రకటించడంతో వారు శాంతించారు.

అసలేం జరిగింది..?
రాజన్న సిరిసిల్ల జిల్లా, తంగళ్ళపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఈ ఘటన జరిగింది. గురుకులంలోని హాస్టల్ లో 500 మంది అమ్మాయిలకు కేవలం 2 బాత్రూమ్ లు మాత్రమే ఉన్నాయి. అవి సరిపోవడం లేదని వారు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. పైగా స్కూల్ కి లేట్ గా వస్తున్నారని స్టూడెంట్స్ నే తిట్టేవారు. ఈ క్రమంలో పీఈటీ టీచర్ జ్యోత్స్న విద్యార్థినులపై మరింత ఒత్తిడి పెంచారు. ఆలస్యంగా వస్తే ఊరుకునేది లేదన్నారు. ఎందుకు ఆలస్యం అవుతుందంటూ నేరుగా వారి బాత్రూమ్ లలోకే వెళ్లారు. డోర్ పగలగొట్టి సెల్ ఫోన్ తో వీడియోలు తీశారు. దీంతో విద్యార్థినులు భయభ్రాంతులకు గురయ్యారు.

బాత్రూమ్ లోకి వచ్చి వీడియోలు తీయడంతోపాటు, పీఈటీ టీచర్ తమను దారుణంగా కొడుతుందని, బూతులు తిడుతుందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 500మంది విద్యార్థినులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేశారు. సిరిసిల్ల, సిద్ధిపేట రోడ్ పై ఆందోళన చేపట్టడంతో పోలీసులు అక్కడికి వచ్చారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా వచ్చి సమస్య తెలుసుకున్నారు. వెంటనే పీఈటీ టీచర్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. దీంతో విద్యార్థినులు శాంతించి స్కూల్ కి వెళ్లిపోయారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...