YouTube channel subscription banner header

సందర్శకులకు దివ్యానుభూతిని కలిగిస్తున్న బుద్ధవనం

Published on

తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నాగార్జునసాగర్ లో నిర్మించిన బుద్ధవనం ఒక అద్భుత బౌద్ధ వారసత్వ ప్రదర్శనశాల అని అంతర్జాతీయ హార్ట్ ఫుల్ నెస్ మార్గదర్శి దాజీ కమలేష్ పటేల్ అన్నారు. శుక్రవారం నాడు నాగార్జునసాగర్ లోని హార్ట్ ఫుల్ నెస్ (రామచంద్ర మిషన్) కేంద్రాన్ని సందర్శించిన అనంతరం తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ ప్రకాశ్ రెడ్డి ఆహ్వానంపై దాజీ బుద్ధవనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా బుద్ధ వనంలోని మహాస్థూపంలోపల బుద్ధుని పరమ పవిత్రమైన దాతు పేటికలను, బౌద్ధాలయాన్ని సందర్శించారు.

బుద్ధవనంలోని ప్రధాన ఆకర్షణలైన బుద్ధ చరితవనం, జాతకవనం, ధ్యానవనం, 27 అడుగుల శ్రీలంక అవకన బుద్ధ ప్రతిమ, స్థూప వనాల గురించి ఆయనకు బుద్ధవనం బుద్ధిష్ట్ ఎక్స్పర్ట్ కన్సల్టెంట్ డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి వివరించారు. మహాస్థూపం చుట్టూ ఉన్న శిలాఫలకాలలోని బుద్ధుని జీవిత ఘట్టాలు, ఆయన సంచరించిన ప్రదేశాలు, బౌద్ధానికి చేయూతనిచ్చిన పోషకులు, జాతక కథలు ఇంకా 1700 సంవత్సరాల తరువాత మళ్లీ జీవం పోసుకున్న అమరావతి శిల్పకళ ప్రాశస్త్యంపై శివనాగిరెడ్డి బాజీకి వివరించారు.

బుద్ధవనం ఏర్పాటు చేసిన నేపథ్యాన్ని, బౌద్ధ వారసత్వ విలువలను ఈ తరానికి అందించాలన్న ప్రభుత్వ ఉద్దేశాన్ని, ఆచార్య నాగార్జున ని తాత్విక చింతనను వ్యాపింప చెయ్యటానికి తీసుకుంటున్న చర్యలను బుద్ధవనం ప్రత్యేక అధికారి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ప్రకాశ్ రెడ్డి ఆయనకు వివరించారు. ఈ కార్యక్రమంలో జెన్కో సీఎండీ రోనాల్డ్ రోస్, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్ విశాలాక్షి, బయో జెన్ కేర్ డైరెక్టర్ బి.పార్థసారథి, బుద్ధవనం అధికారి సుద‌న్ రెడ్డి, మిర్యాలగూడ డి. ఎస్. పి. రాజశేఖర్ రాజు, బుద్ధ వనం డిజైన్ ఇన్చార్జి శ్యాంసుందర్రావు తదితరులు పాల్గొన్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...