YouTube channel subscription banner header

జానీ మాస్టర్ కు జనసేన షాక్

Published on

ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో జానీ మాస్టర్ ట్రెండింగ్ టాపిక్ గా ఉన్నారు. ఆయనపై హైదరాబాద్ లో రేప్ కేసు నమోదు కావడంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది. జనసేన తరపున స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న జానీ మాస్టర్ ని వైరి వర్గం టార్గెట్ చేసింది. జనసేన పార్టీపై కూడా సెటైర్లు పడుతున్నాయి. పవన్ కల్యాణ్ తో కంపేర్ చేస్తూ జానీ మాస్టర్ పై ఆరోపణలు తీవ్రతరం చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన పార్టీ నష్టనివారణ చర్యలు చేపట్టింది. జానీ మాస్టర్ ని పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఈమేరకు ఓ ప్రెస్ నోట్ కూడా విడుదలైంది.

https://x.com/JanaSenaParty/status/1835627168501506124

జానీ మాస్టర్ పై ఓ మహిళా కొరియోగ్రాఫర్ హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఆ ఫిర్యాదుపై మరిన్ని వివరాలు సేకరించేందుకు ఆరోపణలు చేసిన మహిళకు నార్సింగి పోలీసులు ఫోన్ చేశారు. ఆమె అందుబాటులో లేదన్న సమాచారం వచ్చింది. దీంతో నార్సింగి పోలీసులు ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇటు జానీ మాస్టర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్లినట్టు తెలుస్తోంది. జానీ మాస్టర్ రాజీ ప్రయత్నాలు ప్రారంభించారనే వార్తలు వినపడుతున్నాయి.

జానీ మాస్టర్ కేసులో ఇప్పటికే పలు ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి. జానీ మాస్టర్ టీమ్ లోని కొరియోగ్రాఫర్ గతంలో జరిగిన దాడిపై ఇప్పుడు కేసు పెట్టడం విశేషం. సదరు మహిళా కొరియోగ్రాఫర్ హిందువు కాగా, జానీ మాస్టర్ భార్య కూడా ఆమెను మతం మార్చుకుని, తన భర్తని పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో నిజానిజాలేంటో పోలీస్ విచారణలో తేలాల్సి ఉంది.

జానీ మాస్టర్ ఢీ ప్రోగ్రామ్ ద్వారా ఫేమస్ అయ్యారు. చిన్న చిన్న సినిమాలతో మొదలు పెట్టి ఇప్పుడు స్టార్ హీరోల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఇటీవలే జాతీయ ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు కూడా అందుకున్నారు. ఆమధ్య హీరోగా ఓ సినిమా కూడా మొదలు పెట్టారు. ఇటు జనసేనలో కూడా ఆయనకు మంచి పేరొచ్చింది. పార్టీ అధికారంలోకి రావడంతో ఆయనకు ఏదైనా నామినేటెడ్ పదవి వస్తుందనే అంచనాలు కూడా ఉన్నాయి. అన్నిరకాలుగా కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్నసమయంలో రేప్ కేసులో ఆయన ఇరుక్కోవడం సంచలనంగా మారింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...