YouTube channel subscription banner header

జానీ కేసులో టాలీవుడ్ రియాక్షన్ ఏంటంటే..?

Published on

కొరియెగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ పై ఉన్న రేప్ కేసుపై టాలీవుడ్ స్పందించడం విశేషం. గతంలో ఇలాంటి కేసులు వస్తే టాలీవుడ్ నుంచి పెద్దగా ఎవరూ స్పందించలేదు. ఈసారి మాత్రం టాలీవుడ్‌ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ ప్రెస్‌ మీట్‌ కూడా పెట్టింది. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నటి ఝాన్సీతో పాటు ప్యానెల్‌ సభ్యులు ఇందులో పాల్గొన్నారు.

ఇలాంటి కేసుల్లో బాధితుల వివరాలు బయటకు చెప్పకూడదని అన్నారు నటి ఝాన్సీ. బాధితురాలు మొదట మీడియాను ఆశ్రయించిందని, ఆ తర్వాతే ఆ ఘటన తమ దృష్టికి వచ్చిందని చెప్పారామె. తన వర్క్ ప్లేస్ లో వేధింపులకు గురవుతున్నానని ముందుగా తమకి చెప్పిన బాధితురాలు తర్వాత ఛాంబర్‌ను ఆశ్రయించిందని అన్నారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న సమయంలో ఆ అమ్మాయి మైనర్‌ అని, ఆమెకు న్యాయ సహాయం అవసరం అని చెప్పారు. 90 రోజల్లో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని బయటపెడతామని కూడా టాలీవుడ్ ప్రముఖులు చెప్పడం విశేషం.

‘వాయిస్‌ ఆఫ్‌ విమెన్‌’ అనేది కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిందేనని చెప్పారు ఝాన్సీ. ప్రస్తుతం టాలీవుడ్‌ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ వద్దకు వచ్చిన ఫిర్యాదుల సంఖ్య సింగిల్‌ డిజిట్‌లోనే ఉందని అన్నారామె. కొన్నింటికి తక్షణమే పరిష్కారం చూపామని అన్నారు. అదే సమయంలో ఫేక్‌ కంప్లైట్స్‌ కూడా తమకు వస్తున్నాయన్నారు. పరిష్కార ప్యానెల్ ని పలువురు మహిళలు మిస్‌ యూజ్‌ కూడా చేస్తున్నారనే సమాచారం కూడా ఉందన్నారు. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు పోతాయనే భయంతో చాలా మంది తమకు ఎదురైన పరిస్థితులను చెప్పడం లేదని, ప్రతిభ ఉన్న వాళ్లకు ఇండస్ట్రీలో అవకాశాలు ఎప్పుడూ లభిస్తాయని ఝాన్సీ స్పష్టం చేశారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...