YouTube channel subscription banner header

ఏపీలో వరద బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ

Published on

ఏపీలో వరద బాధితులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది. సీఎం చంద్రబాబు ఈ ప్యాకేజీ వివరాలను స్వయంగా ప్రకటించారు. వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు కట్టిస్తామని ఆయన హామీ ఇచ్చారు. వరద ప్రభావానికి గురైన ప్రతి ఇంటికి రూ.25వేలు ఆర్థిక సాయం చేస్తున్నామని చెప్పారాయన. అపార్ట్ మెంట్ లు, ఇతర భవంతుల్లో ఉండేవారికి కూడా ఆయన సాయం ప్రకటించారు. మొదటి అంతస్తులో ఉండే వారికి రూ.10వేలు, ఇళ్లలోకి నీళ్లు వచ్చిన వారికి రూ.10వేలు, చిరు వ్యాపారులకు రూ.25వేల చొప్పున పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు.

https://x.com/JaiTDP/status/1836062412329410700

వాహనాలకు కూడా గతంలోనే ప్రభుత్వం పరిహారం ప్రకటించగా, మరోసారి దాన్ని రివైజ్ చేసి ప్రెస్ మీట్ లో చెప్పారు సీఎం చంద్రబాబు. టూవీలర్స్‌కు రూ.3వేలు, ఆటోలు, ఇతర మూడు చక్రాల వాహనాలకు రూ.10 వేలు ఇస్తామన్నారు. ఫిషింగ్‌ బోట్‌ లు దెబ్బ తిన్నా, వలలు పాక్షికంగా డ్యామేజీ అయినా రూ.9వేలు, వలలు పూర్తిగా డ్యామేజీ అయితే రూ.20వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. పట్టు పురుగుల పెంపకాన్ని చేపట్టి నష్టపోయిన వారికి రూ.6వేలు ఇస్తామన్నారు. వరదల్లో పశువులు నష్టపోయిన వారికి ఒక్కో పశువుకు రూ.50వేలు చొప్పున లెక్కగట్టి ఇస్తారు. వరి ఎకరాకు రూ.10వేలు, చెరకు రూ.25వేలు చొప్పున పరిహారం చెల్లిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు.

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కూడా సాయం అందిస్తామన్నారు సీఎం చంద్రబాబు. చేనేత కార్మికులకు రూ.15వేలు ఇస్తామన్నారు. రూ.40లక్షల నుంచి రూ.1.5 కోట్ల టర్నోవర్‌ ఉన్న ఎంఎస్‌ఎంఈలకు లక్ష రూపాయల సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. కోటిన్నర రూపాయలకు పైగా టర్నోవర్‌ ఉన్న వాటికి లక్షన్నర రూపాయలు ఇస్తారు. కోళ్ల ఫారం ద్వారా నష్టపోయిన వారికి ఒక్కో కోడికి రూ.100 చొప్పున లెక్కగట్టి ఇస్తారు. కోళ్ల ఫారం షెడ్డు ధ్వంసమైతే రూ.5వేలు ఇస్తారు. టూవీలర్లకు సంబంధించిన యజమానులు రూ.71 కోట్ల మేర క్లెయిమ్‌లు చేసినట్టు తెలుస్తోంది. వీటిల్లో 6వేల క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...