రాష్ట్ర విభజన జరిగినప్పుడు ఎన్నికల్లో గెలుపు కోసం చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరాడు. అప్పుడు ప్రధాని మోదీ కూడా వచ్చి ఎన్నికల ప్రచారం చేశారు. కానీ 2019 ఎన్నికల తర్వాత ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చేశాడు. ప్రధాని మోదీపై విమర్శల వర్షం కూడా కురిపించాడు. అయితే.. ఆ సమయంలో తొందరపడవద్దని, ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వెళ్లొద్దని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చిలక్కి చెప్పినట్లు చెప్పాడు. కానీ.. చంద్రబాబు వింటాడా..? వినకపోగా రెచ్చిపోయి విమర్శలు చేశాడు. కాంగ్రెస్తో చేతులు కలిపి చెలరేగిపోయాడు. ఫలితం.. ఆ ఎన్నికల్లో గెలవకపోగా.. ఈ ఎన్నికల్లోనూ గెలుస్తామనే నమ్మకం లేకుండా మిగిలిపోయాడు.
ఈ సారి మళ్లీ ఎన్నికల్లో గెలవాలి అంటే.. పాత ఫార్ములానే వాడాలి అని అనుకుంటున్నాడు. మళ్లీ ఎన్డీఏలో చేరేందుకు పాకులాటలు మొదలుపెట్టాడు. బీజేపీ నేతలతో చర్చలు మొదలుపెట్టాడు. అయితే.. రీసెంట్గా వెంకయ్య నాయుడు ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు,
2018లో ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగడానికి సిద్ధపడిన సమయంలో గుంటూరులో చంద్రబాబు తనను కలిశారని, ఎన్డీఏలో కొనసాగాలని తాను చంద్రబాబుకు చెప్పానని, అందుకు చంద్రబాబును ఒప్పించడానికి ప్రయత్నించానని, అయితే చంద్రబాబు అంగీకరించలేదని ఆయన చెప్పారు. ఎన్డీఏలో కొనసాగితే టీడీపికి ఆంధ్రప్రదేశ్లో గెలిచే అవకాశాలు తగ్గుతాయని టీడీపీ భావించింది. బిజెపిపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉందని, అందువల్ల ఎన్డీఏ నుంచి వైదొలగడమే మంచిదని భావిస్తున్నానని చంద్రబాబు అన్నట్లు వెంకయ్య నాయుడు తెలిపారు.
ఎన్డీఏ నుంచి వైదొలిగితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రెండు పనులు చేయవద్దని చంద్రబాబుకు సూచించానని, ఒకటి.. నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, రెండు… కాంగ్రెస్ ప్రెసిడెంట్ కలవకూడదని తాను చేసిన సూచనలు అని ఆయన వివరించారు. అయితే, వెంకయ్యనాయుడు చేసిన రెండు సూచనలను కూడా చంద్రబాబు పట్టించుకోలేదు. అప్పుడు ఆయన మంచి కోసం ఎంత చెప్పిని వినకుండా.. మోడీని తిడితే తనకు ఓట్లు పడతాయి అనుకున్నాడు. ఫలితంగా.. ఓటమి చవి చూడాల్సి వచ్చింది. ఇప్పుడు.. మళ్లీ గెలవడం కోసం ఆ బీజేపీ చెంత చేరడానికి ప్రయత్నాలు చేస్తుండటం గమనార్హం. అప్పుడు అసహ్యించుకుంటారేమో అనుకుని విమర్శించిన బాబు.. ఇప్పుడు మళ్లీ వారి చెంత చేరితే.. అసహ్యించుకోరా.. ఆ విషయాన్ని చంద్రబాబు ఎలా మరచారు..?