ఎన్నికలు దగ్గరపడుతుండటంతో.. టీడీపీ నేతలు.. అధికార పార్టీపై ఎన్ని కుట్రలు చేయడానికైనా వెనకాడటం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈమేజ్‌ను డ్యామేజ్ చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దానిలో భాగంగా ఫేక్ ప్రచారాలు కూడా చేస్తున్నారు. తాజాగా యాత్ర-2 సినిమా విషయంలోనూ ఇలాంటి ఫేక్ ప్రచారం చేశారు. కానీ..అది కాస్త రివర్స్ అయ్యింది.
ఇంతకీ వాళ్లు ఏం చేశారంటే… ఏపీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ జీవితం ఆధారంగా రూపొందించిన యాత్ర-2 సినిమా ఇవాళ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. దీంతో ఈ సినిమాను టీడీపీ టార్గెట్ చేసింది. సినిమాకు సంబంధించి ఓ ఫేక్ జీవోను తయారు చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఆ జీవోలో యాత్ర-2 సినిమాకు థియేటర్ల ఫుల్ ఉండేలా చూడాలని, ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసినట్లు ఓ ఫేక్ జీవో తయారు చేశారు. ఫస్ట్ రెండు రోజులు ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బంది సినిమా చూసేలా ఆదేశాలు జారీ చేయాలని ఆ జీవోలో పేర్కొన్నారు. వలంటీర్లు సైతం సంక్షేమ పథకాలు పొందుతున్న పది మందిని థియేటర్లకు తరలించేలా చూడాలని జీవోలో సూచించారు. విలేజ్ వలంటీర్ ఒక్కొక్కరికి పది టికెట్లు కేటాయించేలా థియేటర్ ఓనర్లతో కలెక్టర్లు మాట్లాడాలంటూ ఓ ఫేక్ జీవోను తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. దీంతో అది కాస్త వైరల్‌గా మారింది.
సినిమాని బలవంతంగా చూపిస్తున్నారని, కావాలని థియేటర్లు ఫుల్ చేస్తున్నారని ప్రజలు అనుకోవాలని వారు కావాలనే ఈ జీవో తయారు చేశారు, కానీ.. ఆ జీవో ఫేక్ అని వెంటనే తెలిసిపోయింది. వారు చేసిన తప్పు కారణంగానే అది ఫేక్ అని అర్థం కావడం గమనార్హం.
జీవోలో అంతా బానే మేనేజ్ చేసినప్పటికీ..అసలు సీఎస్ ఎవరనే విషయంలో తమ అజ్ఞానాన్ని బయటపెట్టుకున్నారు పచ్చ తమ్ముళ్లు. మాజీ సీఎస్ నీలం సాహ్ని పేరుతో ఈ జీవో తయారు చేశారు. కానీ నీలం సాహ్ని 2020 డిసెంబర్ 31నే ఏపీ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయ్యారు. ప్రస్తుతం ఏపీ సీఎస్‌గా జవహర్ రెడ్డి కొనసాగుతున్నారు. దీంతో.. వారు చేసిన కుట్ర బయటపడింది. దీంతో.. టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా జగన్ విజయాన్ని అడ్డుకోలేరు అనే కామెంట్స్ ఎక్కువగా వినపడుతున్నాయి.