YouTube channel subscription banner header

రామోజీ బుర్ర పాడైందా..?

Published on

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది ఎల్లో మీడియా రెచ్చిపోతోంది. ఎప్పుడెప్పుడు జగన్‌పై తప్పుడు కథనాలు రాద్దామా అన్న దానిపై తప్ప.. మరో విషయంపై దృష్టి పెట్టకపోవడం గమనార్హం. కేవలం జగన్‌పై తప్పుడు కథనాలు రాయడంపైనే రామోజీ ఫోకస్ పెట్టారు. రీసెంట్‌గా వలంటరీ వ్యవస్థపై తమ అక్కసు మొత్తం వెళ్లగక్కారు. అలాంటి క‌థ‌నాలను చూసిన‌ప్పుడు రామోజీ బుర్ర ఏమైనా పాడైందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

‘జగనన్న పాపాలు’ అనే హెడ్డింగ్ పెట్టి దానికి ట్యాగ్ లైన్‌గా ‘ఊరూరా వలంటీర్లు…అన్ని చోట్లా జగన్ అరాచకాలు’ అనే స్టోరీని అచ్చేశారు. దానిపై వలంటీర్లు మండిపోతున్నారు. కాకినాడ, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతిలో వలంటీర్లు పెద్దఎత్తున ఎల్లో మీడియాకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పేపర్లను తగలబెట్టారు. రామోజీరావును నానా మాటలన్నారు. ఇలాంటి తప్పుడు వార్తలు ఇంకోసారి రాస్తే… కొడతామని వార్నింగ్ ఇచ్చారు.

ఇంతకీ ఆ కథనంలో వలంటీర్ల గురించి ఏం రాశారంటే.. పేరుకు వలంటీర్లు స్వచ్ఛంద‌ సేవకులే కానీ చేస్తున్నదంతా జగన్ సేవ అని రాశారు. ఈ మాటకే వలంటీర్లకు విపరీతంగా కాలిపోయింది. వలంటీర్లను నియమించింది ప్రజలకు సేవ చేయడానికే… వాళ్లు చేస్తున్నది కూడా అదే. కానీ దానినే తప్పు పడుతూ కథనం రాశారు.

వైసీపీ అరాచకాలకు వలంటీర్లు తోడూనీడగా మారారని ఆరోపించారు. ప్రజలపై వలంటీర్లు నిఘా వేయటం ఏమిటి? వైసీపీ అరాచకాలకు వలంటీర్లు తోడుగా ఉండటం ఏమిటో రామోజీకే తెలియాలి. వలంటీర్లంటే ప్రభుత్వ సొమ్ముతో ఏర్పాటైన జగన్ ప్రైవేటు సైన్యమట. ఈ విషయాన్ని చెప్పాల్సింది రామోజీ కాదు జనాలు. వలంటీర్ల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని జనాలు చెబితే మిగిలిన వాళ్ళు నమ్ముతారు.

జనాలపై వలంటీర్లు నిఘా వేసి.. ప్రజల విషయాలు తెలుసుకొని దానిని వైసీపీ నేతలకు చెబుతున్నారంటూ ఆ వార్తల్లో పేర్కొనడం గమనార్హం. ప్రభుత్వ సేవలనే తేనె పూసి కంటికి కనిపించని గూఢచర్యంతో జనాల జీవితాలను అభద్రతకు గురిచేస్తున్నారట వలంటీర్లు. నిజంగా రామోజీ రాసిందాంట్లో ఏ ఒక్కటి నిజమైనా జనాలు ఊరుకుంటారా? వలంటీర్లను ఉరికించి తరిమి కొట్టేవాళ్ళు కాదా? స్టోరీ చదివిన తర్వాత అర్థ‌మవుతున్నది ఏమిటంటే ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వలంటీర్ల మీదకు జనాలను రెచ్చగొట్టాలి. దాని ప్రకారమే.. ఈ కథనాలు రాస్తున్నారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

జనాలకు, వలంటీర్ల మధ్య చిచ్చు పెట్టి.. దానిని టీడీపీకి అనుకూలంగా మార్చుకోవాలని ఎల్లో మీడియా ప్లాన్ వేయడం విశేషం. వలంటీర్ల సర్వీసు విషయంలో జనాలు చాలావరకు హ్యాపీగానే ఉన్నారు. కానీ.. ఎల్లో మీడియా మాత్రం.. హ్యాపీగా లేరని.. అవస్థలు పడపుతున్నారని.. వలంటీర్లు నిఘా పెడుతున్నారంటూ ఊదరగొడుతుంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...