YouTube channel subscription banner header

చంద్రబాబుకు బీజేపీ అవసరమే లేదట

Published on

ప్రతి ఆదివారం ఎల్లో మీడియాలో అచ్చయ్యే చె(కొ)త్తపలుకులో యాజమాన్యం ఒక కొత్త విషయం వినిపించింది. అదేమిటంటే రాబోయే ఎన్నికల్లో గెలుపున‌కు చంద్రబాబు నాయుడుకు బీజేపీ అవసరం లేనేలేదట. ఎందుకంటే చంద్రబాబు గెలుపు ఖాయమైపోయిందట. ఇదే విధంగా కేంద్రంలో మళ్ళీ బీజేపీ గెలుపు కూడా స్పష్టమైపోయింది. అయినాసరే పిలిచిందే ఆలస్యం వెంటనే చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళారట.. ఇది వాస్తవమట. రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం టీడీపీకి బీజేపీ అవసరం కానీ, బీజేపీకి టీడీపీ అవసరం కాని లేనేలేదట.

అయినా సరే పొత్తు అనివార్యం ఎందుకవుతోందంటే ఎన్నికలు సజావుగా సాగాలంటే కేంద్రం ముఖ్యంగా ఎన్నికల కమిషన్ సహకారం చాలా అవసరమట. అందుకనే చంద్రబాబు బీజేపీతో పొత్తు పెట్టుకుంటున్నారని ఎల్లో మీడియా చెప్పింది. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు గడచిన ఐదేళ్ళుగా శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. దాన్ని సమర్థిచుకునేందుకు చంద్రబాబు తరపున చెత్త పలుకులో పిచ్చిలాజిక్ ఒకటి జనాలకు వినిపిస్తున్నారు. బీజేపీతో పొత్తు లేకపోయినా జగన్ ఎన్డీయేతో అంటకాగుతున్నారట. అందుకనే అడగకపోయినా మద్దతిస్తున్నారట. మరి చంద్రబాబు చేస్తున్నది ఏమిటి?

కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులు రాజ్యసభలో పాస్ అయ్యేందుకు సహకరించమని నరేంద్ర మోదీ, అమిత్ షాలు జగన్‌ను గతంలో అడిగిన మాట వాస్తవం. బిల్లులకు పార్లమెంటులో సహకరించమని అడిగారు కాబట్టే జగన్ మద్దతిస్తున్నారు. అంతేకాని ప్రతి బిల్లుకు సహకరించమని ప్రతిసారి అడగరు. ఇదేసమయంలో ఎవరడిగారని చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి భేషరతుగా మద్దతిస్తున్నారో ఎల్లో మీడియా చెప్పగలదా? ఇక్కడ విషయం ఏమిటంటే వ్యక్తిగత అవసరాల కోసం జగన్, చంద్రబాబు ఇద్దరు కేంద్రం మీద ఆధారపడ్డారని అందరికీ తెలుసు. అంతేకాని జగన్ అంటకాగిందిలేదు చంద్రబాబు వ్యతిరేకించిందీలేదు.

బీజేపీ(bjp)కి చంద్రబాబు అవసరం లేదన్నది వాస్తవం. కాని చంద్రబాబుకు బీజేపీ అవసరం చాలా ఉంది. చంద్రబాబు గెలుపు గ్యారెంటీ అని ఎల్లో మీడియా(yellow media) డప్పేస్తోందంతే. నిజంగానే టీడీపీ గెలుపు అంత ఖాయమైతే చంద్రబాబు వైఖరి వేరే విధంగా ఉండేది. పొత్తు కోసం బీజేపీ ముందు పాహిమాం పాహిమాం అంటు మోకరిల్లేవారు కాదు. చంద్రబాబు నైజం తెలియనివాళ్ళంటూ ఎవరు లేరు. చంద్రబాబు బలోపేతమయ్యారని, గెలుపు ఖాయమని చెత్త పలుకులో రాసుకోవాల్సిన అవసరమే లేదు.

జగన్ బలహీనపడిపోయారని, ఓటమి భయం వెన్నాడుతోందని రాసుకుని తృప్తి పడిపోయింది చెత్త పలుకు. ఎలాగంటే ఒకప్పుడు ‘నా వెంట్రుక కూడా పీకలేరు’ అన్న జగన్ ఇప్పుడు ‘మిమ్మల్నే నమ్ముకున్నాను.. మీరే గెలిపించాలి’ అని ప్రాదేయపడుతున్నట్లు రాసింది. నా వెంట్రుక కూడా పీకలేరన్నది ప్రతిపక్షాలను ఉద్దేశించి. ఇక ఓట్లేయాల్సిన జనాలను ఉద్దేశించి మిమ్మల్నే నమ్ముకున్నాను, మీరే గెలిపించాలని అడగటంలో తప్పేముంది? ఎవరైనా ఓట్లడిగే పద్దతి అదే కదా? మీరు ఓట్లేయకపోయినా గెలుస్తానని ఎవరైనా జనాలతో అంటారా? చంద్రబాబును ఎన్నికల ప్రచారంలో ఒక్క మీటింగులో జనాలతో అలాగే చెప్పమని ఎల్లో మీడియా చెప్పగలదా?

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...