YouTube channel subscription banner header

చంద్రబాబు, రేవంత్‌ కుమ్మక్కయ్యారు.. కానీ..!

Published on

ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి కుమ్మక్కయ్యారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. విచారణ వాయిదా వేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరడం చూస్తేనే విషయం అర్థమవుతోందన్నారు. గతంలో చంద్రబాబు ఆదేశాల మేరకు నాడు టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డి రూ.5 కోట్లకు బేరం కుదుర్చుకొని రూ.50 లక్షలు బయానాగా ఇచ్చిన విషయాన్ని దేశం మొత్తం స్పష్టంగా చూసిందన్నారు.

ఓటుకు నోటు కేసులో 2017లో తాను సుప్రీంకోర్టును ఆశ్రయించానన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అన్ని సాక్షాలు ఉన్నా.. అనేక సాకులతో చంద్రబాబు న్యాయవాదులు కేసును సాగదీస్తూ వచ్చారని ఆరోపించారు. ఈసారి తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కూడా వాయిదా కోరడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తెలంగాణ న్యాయవాదులకు, బాబు న్యాయవాదులు వత్తాసు పలకడం చూస్తుంటే చంద్రబాబు, రేవంత్‌రెడ్డి కుమ్మక్కైనట్టు ఇట్టే తెలిసిపోతోందన్నారు. జూలై 24 నుంచి వాదనలు మళ్లీ మొదలవుతయన్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. కేసు నుంచి వారిద్దరూ తప్పించుకోలేరని.. చంద్రబాబుకు శిక్ష తప్పదన్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...