టీడీపీ అధినేత చంద్రబాబు మాయ మాటలతో ప్రజలను ప్రలోభపెట్టడం అతనికి వెన్నతో పెట్టిన విద్య అని చెప్పాలి. అయితే ఇలాంటి పనులు జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం చేతకావు. జగన్ తన సామాజిక వర్గానికి న్యాయం చేస్తుంటారని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే కూటమిగా ఏర్పడిన టీడీపీ, జనసేన, బీజేపీ కేవలం వారి అనుకూలంగా ఉన్నటువంటి వారికి మాత్రమే టికెట్లు ఇచ్చి, మిగిలిన సామాజిక వర్గాలకు అన్యాయం చేశాయి.
ముఖ్యంగా కాపులకు కూటమిలో తీవ్ర అన్యాయం జరిగింది. కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సైతం తన సామాజిక వర్గానికి చెందిన వారికి సరైన స్థానాలలో సీట్లు ఇప్పించుకోలేకపోయారు. 175 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి కాపులకు కేటాయించిన సీట్ల సంఖ్య కేవలం 23 స్థానాలు మాత్రమే ఇక 25 లోక్ సభ స్థానాలలో కేవలం మూడు సీట్లు మాత్రమే కాపులకు ఇచ్చింది.
కానీ జగన్ పార్టీలో మాత్రం ఏ సామాజిక వర్గానికి చెందిన వారికి కూడా అన్యాయం జరగలేదని చెప్పాలి. తన సొంత సామాజిక వర్గానికి చెందిన వారి కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. 175 స్థానాలలో కాపులకు ఏకంగా 31 సీట్లను జగన్ కేటాయించారు. 25 లోక్ సభ స్థానాల విషయానికి వస్తే కాపులకు ఏకంగా ఐదు సీట్లను కేటాయించి, కాపుల పట్ల తనకు ఉన్నటువంటి అభిమానాన్ని చాటుకున్నారు. చంద్రబాబు మాటవరసకే నా కాపులు అంటారే తప్ప ఆయన టికెట్ల విషయంలో మాత్రం తన సామాజిక వర్గానికి చెందిన వారికే పెద్ద పీట వేశారు.