YouTube channel subscription banner header

వరద రాజకీయం.. జగన్ పై చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

Published on

‘మ్యాన్ మేడ్ ఫ్లడ్స్’ అంటూ జగన్ చేసిన కామెంట్ పై సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. గత ఐదేళ్లలో ఎప్పుడైనా మంత్రి కానీ, ముఖ్యమంత్రిగానీ ఫీల్డ్ కి వచ్చారా అని ప్రశ్నించారు. విపత్తులు వస్తే రెడ్ కార్పెట్ వేసుకుని ఫీల్డ్ విజిట్ చేశారని, ఇప్పుడు విధిలేని పరిస్థితుల్లో జగన్ బురదలోకి వచ్చారని ఎద్దేవా చేశారు. గతిలేక బురదలో దిగి చెత్తరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తుపాన్ గురించి, వరదల గురించి తనకు చెప్పే పరిస్థితి ఉందా అన్నారు. క్రిమినల్ ఆలోచనలు ఉన్న జగన్ లాంటి నేతలు వాళ్లే తప్పులు చేసి, నేరాలు చేసి వాటిని ఎదుటివారిపై నెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచిస్తుంటారని విమర్శించారు చంద్రబాబు.

https://x.com/JaiTDP/status/1830670139819467128

జగన్ లాంటి వాళ్లతో రాజకీయం చేయాల్సి రావటం మన ఖర్మ అని అన్నారు చంద్రబాబు. రాష్ట్రంలో జరుగుతున్న వరుస ఘటనల్లో కుట్రకోణం ఉందనే అనుమానం కలుగుతోందన్నారు. ప్రకాశం బ్యారేజ్ గేట్లకు బోట్లు అడ్డుపడ్డాయని, వాటిని తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇలాంటి వార్తలన్నీ ముందుగా వాళ్ళ బ్లూ మీడియాలోనే వస్తున్నాయని గుర్తు చేశారు. వాళ్ళు కరకట్టలకు ఎక్కడ గండ్లు కొడతారో అనే అనుమానంతో.. గట్ల వెంట సెక్యూరిటీ కూడా పెట్టామని అన్నారు చంద్రబాబు.

https://x.com/JaiTDP/status/1830675655295398234

రాజకీయ ముసుగులో తప్పించుకోవచ్చని కొంతమంది ఆలోచిస్తున్నారని, ఎవర్నీ వదిలిపెట్టబోనన్నారు చంద్రబాబు. అమరావతి మునిగిపోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బుడమేరు గేట్లు ఎత్తారని, సీఎం ఇంటికి నీళ్లు వచ్చాయంటున్నారని, తన ఇంట్లోకి నీళ్లొస్తే ఏమవుతుందని, అందరి ఇళ్లలోకి నీళ్లొచ్చాయని చెప్పారు. గతంలో విశాఖకు నష్టం వచ్చినప్పుడు ఆదుకున్నామని, ఇప్పుడు విజయవాడని కూడా సెట్ రైట్ చేస్తామన్నారు. తన 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత పనికిమాలిన పాలిటిక్స్ ఎప్పుడూ చూడలేదన్నారు.

https://x.com/JaiTDP/status/1830671392037081100

విజయవాడలో 39 డివిజన్లకు 39 మంది సీనియర్ ఐఏఎస్‍లను స్పెషల్ ఆఫీసర్లుగా నియమించి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు సీఎం చంద్రబాబు. ముంపు పరిధిలో ఉన్న 179 సచివాలయాలకు 179 మంది ఇన్‍చార్జ్ లను నియమించామన్నారు. ఆహార ప్యాకెట్లను అందించడం కోసం బోట్లు, డ్రోన్లు ఉపయోగిస్తున్నామన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నారని, వారి బాధలను అర్థం చేసుకోవాలని, సహనంతో వ్యవహరించాలన్నారు చంద్రబాబు. వాళ్లు ఎమోషనల్ గా మాట్లాడతారని, వాళ్ల పరిస్థితి అర్థం చేసుకుని వారి ఆవేశాన్ని అర్థం చేసుకుని సముదాయించాలని అధికారులకు సూచించారు.

https://x.com/JaiTDP/status/1830678878739931214

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...