YouTube channel subscription banner header

షర్మిల అప్పుడెందుకు ఏడ్వలేదు?

Published on

కాంగ్రెస్ ఏపీ చీఫ్ షర్మిల సెంటిమెంటు పండించేందుకు భలే ప్రయత్నిస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన పేరుతో అమరావతిలో ఒక కార్యక్రమం జరిగింది. అందులో ఆమె భోరున‌ ఏడ్చేశారు. ఎందుకంటే పాలకులు జనాలను గొర్రెలను చేసేశారట. మొదటి ఐదేళ్ళు చంద్రబాబు జనాలను గొర్రెల్లగా చూస్తే, ఇప్పుడు ఐదేళ్ళు జగన్ జనాలను గొర్రెలను చేశారట. కాబట్టి ఇప్పుడు షర్మిల చెప్పిందేమిటంటే జనాలు గొర్రెలు కాదు కొదమసింహాల్లా విజృంభించాలట. ప్రత్యేక హోదా కోసం జనాలంతా పోరాడాలట. అవసరమైతే లాక్కోవాలని షర్మిల చెప్పటమే విచిత్రంగా ఉంది.

ప్రత్యేక హోదా కోసం పోరాడాలని చెప్పటం వరకు ఓకేనే ఇందులో అభ్యంతరం చెప్పాల్సిన అవసరం ఏమీలేదు. మరి లాక్కోవాలని చెప్పటం ఏమిటో షర్మిలకే తెలియాలి. దేన్ని లాక్కుంటారు? ఎవరి దగ్గర నుండి లాక్కుంటారు? జనాలందరూ పదేళ్ళుగా గొర్రెలయిపోయారని చెబుతున్న షర్మిల తాను కూడా గొర్రే అని ఒప్పుకుంటున్నారా? ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం ఇంత గోల చేస్తున్న షర్మిలకు పదేళ్ళుగా హోదా ఎందుకు గుర్తురాలేదు? తెలంగాణలో జనాలు వైఎస్సార్టీపీని పట్టించుకోలేదు కాబట్టి చాపచుట్టేశారు.

కాంగ్రెస్ పెద్దలతో ఏదో ఒప్పందం చేసుకుని తన పార్టీని విలీనం చేసి ఏపీకొచ్చారు. ఏపీకి వచ్చిన దగ్గర నుండి ప్రత్యేక హోదా విషయంలో నానా రచ్చ చేస్తున్నారు. ఇప్పటికి కూడా షర్మిల తెలంగాణలోనే ఉండుంటే ప్రత్యేక హోదా కోసం అసలు పట్టించుకునే వారు కాదన్నది వాస్తవం. తన అవసరం కోసం, జగన్‌ను ఇరుకునపెట్టాలని అనుకున్నారు కాబట్టే కోల్డ్ స్టోరేజీలో పడిపోయిన ప్రత్యేక హోదా డిమాండుకు దుమ్ముదులిపి బయటకు తీశారు.

అయినా ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటాలు చేయాలి, సింహాల్లా విజృంభించాలని పిలుపిస్తున్న షర్మిల ఏడ్వటం ఏమిటో అర్థంకావటంలేదు. ప్రత్యేక హోదా రాకపోతే ఏడ్వాల్సిన అవసరం ఏముంది? అవసరం లేకపోయినా జనాల ముందు ఏడ్చారంటే కేవలం డ్రామా అనే అనుకోవాలి. ఒకవైపు పోరాడాలని చెబుతునే మరోవైపు ఏడ్వటం షర్మిలకే చెల్లింది. జనాలను సెంటిమెంటుతో కొట్టి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్లేయించుకోవాలన్నదే షర్మిల టార్గెట్‌గా కనబడుతోంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ప్రత్యేక హోదా కోసం పోరాడితే అప్పుడు షర్మిలలో చిత్తశుద్ది ఉందని జనాలు నమ్ముతారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...