YouTube channel subscription banner header

బీజేపీ ఉడుంపట్టు.. చంద్రబాబు పరిస్థితి ఏంటి..?

Published on

రాబోయే ఎన్నికల్లో టీడీపీతో జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకుంటున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ పార్టీల మధ్య సీట్ల పంపకాల విషయంలో పొత్తు కుదరడం లేదని తెలుస్తోంది. పవన్ అంటే 20-25 సీట్లకు అంగీకరిస్తాడు కానీ.. బీజేపీ ఎందుకు ఊరుకుంటుంది. టీడీపీ(TDP)తో పొత్తు పెట్టుకోవాలంటే అడిగిన సీట్లను ఇవ్వాల్సిందే అని బీజేపీ పట్టుబడుతున్నట్లు సమాచారం.

పొత్తు, సీట్ల సర్దుబాటుపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళి సమావేశమైన విషయం తెలిసిందే. ఆ చర్చల్లోనే బీజేపీకి 35 అసెంబ్లీ, 8 లోక్ సభ సీట్లు కేటాయించాలని అమిత్ షా గట్టిగా చెప్పారట. అయితే చంద్రబాబు మాత్రం 4 పార్లమెంటు, 15 అసెంబ్లీ సీట్లిస్తామని చెప్పినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అందుకు అమిత్ షా సింపుల్‌గా నో చెప్పినట్లు తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నపుడే 15 అసెంబ్లీ, 4 పార్లమెంటు సీట్లలో పోటీ చేసిన విషయాన్ని అమిత్ షా గుర్తు చేశారట. బీజేపీ(BJP)తో పొత్తు పెట్టుకోవాలంటే తాము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందే అని కచ్చితంగా అమిత్ షా చెప్పినట్లు సమాచారం. దాంతో సీట్ల సంఖ్యపై పార్టీ నేతలతో కూడా మాట్లాడి ఏ సంగతి చెబుతానని చెప్పి చంద్రబాబు వచ్చేశారని ప్రచారం జరుగుతోంది.

బీజేపీ అడిగినట్లు 35 అసెంబ్లీ, జనసేనకు 28 సీట్ల ఇస్తే రెండింటికే 63 అసెంబ్లీ సీట్లు పోతాయి. అలాగే పది పార్లమెంటు సీట్లను వదులుకోవాల్సుంటుంది. పార్లమెంటు సీట్లు బీజేపీకి అవసరం అలాగే అసెంబ్లీ సీట్లు చంద్రబాబుకు ముఖ్యం. అయితే అసెంబ్లీల్లో గెలిస్తేనే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపు సాధ్యమవుతుంది. అందుకనే కమలనాథులు పార్లమెంటు సీట్లతో పాటు అసెంబ్లీ సీట్లను కూడా ఎక్కువగా అడుగుతున్నారట.

బీజేపీ, జనసేనకు అడిగినన్ని సీట్లు ఇస్తే.. చంద్రబాబుకు మిగిలేది చాలా తక్కువ. అంత తక్కువ సీట్లు అంటే.. ముందు టీడీపీ నేతలు ఒప్పుకోవాలట. ప్రతి ఒక్కరూ ఎన్నికలంటే సీటు కావాలనే కోరుకుంటారు. సీటు వదులుకోవడానికి ఎవరూ ముందుకురారు. దీంతో చంద్రబాబుకి సమస్య తప్పదు. 1 శాతం ఓట్ల షేర్ కూడా లేకుండానే అన్ని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను బీజేపీ అడగటం అన్యాయయమని జనసేన నేతలు మండిపోతున్నారట. 5.6 శాతం ఓట్ షేర్ ఉన్న తమ పార్టీకి చంద్రబాబు ఇంకెన్ని సీట్లివ్వాలని పవన్ దగ్గర ప్రస్తావించారట. కాకపోతే బీజేపీ అడిగినట్లు 35 అసెంబ్లీ, 8 పార్లమెంట్ సీట్లు ఇవ్వకపోయినా కనీసం 20 అసెంబ్లీ 6 లోక్ సభ సీట్లయినా ఇవ్వక తప్పదని తెలుస్తోంది. మరి చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...