YouTube channel subscription banner header

చంద్రబాబు జిత్తులమారి ఎత్తులు.. బీజేపీ పెద్దల ఆగ్రహం

Published on

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తీరు పట్ల బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తు పెట్టుకున్న తర్వాత సీట్ల సర్దుబాటు విషయంలో, మిత్రపక్షాల అభ్యర్థుల ఎంపిక విషయంలో చంద్రబాబు అనుసరించిన తీరు వారిని తీవ్రమైన అసంతృప్తికి గురి చేసినట్లు సమాచారం. పవన్‌ కల్యాణ్‌ నేతృత్వంలోని జనసేన అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన జిత్తులమారి ఎత్తులు వేశారని వారు అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. ఆయన వ్యవహారశైలి వల్ల ఆంధ్రప్రదేశ్‌లో కూటమి విజయం సాధించే అవకాశాలను కోల్పోయిందని అంటున్నారు.

తన పార్టీకి చెందిన సగం మంది అభ్యర్థులను జనసేన తరఫున చంద్రబాబు పోటీ చేయిస్తున్నారని, దాని వల్ల జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తికి గురయ్యారని బీజేపీ కేంద్ర నాయకత్వానికి ఒక నివేదిక అందినట్లు ప్రచారం జరుగుతోంది. దానివల్ల జనసేన ఓట్లు టీడీపీకి పడే అవకాశాలు లేకుండా పోయాయని అంటున్నారు.

పవన్‌ కల్యాణ్‌ ఒత్తిడి వల్లనే తాము టీడీపీతో పొత్తుకు అంగీకరించామని, జనసేనను ముంచే ఎత్తులను చంద్రబాబు వేయడం వల్ల విజయావకాశాలు సన్నగిల్లాయని అంటున్నారు. పవన్‌ కల్యాణ్‌కు వెన్నెముక లేదని, దాంతో చంద్రబాబు ఆడించిన‌ట్లు ఆడుతున్నారని బీజేపీ నాయకులు అభిప్రాయపడుతున్నట్లు చెప్పుతున్నారు.

లబ్ధిదారులకు వలంటీర్ల ద్వారా పింఛన్లు అందకుండా చేసింది చంద్రబాబేనని ప్రజలు మండిపడుతున్నట్లు బీజేపీ పెద్దలకు సమాచారం ఉందని అంటున్నారు. తనకు సన్నిహితుడైన నిమ్మగడ్డ రమేష్‌ ద్వారా చంద్రబాబు ఫిర్యాదు చేయించి పింఛన్లను అడ్డుకున్నారని ప్రజలు భావిస్తున్నారని, దానివల్ల చాలా మంది కూటమికి ఓటు వేయకూడదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. తద్వారా చంద్రబాబు సెల్ఫ్‌ గోల్‌ చేసుకున్నారని బీజేపీ నాయకులు మండిపడుతున్నట్లు తెలుస్తోంది.

రఘురామకృష్ణరాజు విషయం బీజేపీ పెద్దలను చీకాకు పుట్టించందని సమాచారం. బీజేపీకి కేటాయించిన తర్వాత కూడా నర్సాపురం లోక్‌సభ సీటు రఘురామకు ఇవ్వాలనే అంశం వారిని ఆగ్రహానికి గురి చేసినట్లు తెలుస్తోంది. ఒక్కసారి సీటును కేటాయించిన తర్వాత తిరిగి దానిపై సంప్రదింపులేమిటని చంద్రబాబుపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండిపడినట్లు తెలుస్తోంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...