బాలీవుడ్ నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా సూసైడ్ చేసుకున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ముంబై బాంద్రాలోని తన అపార్ట్మెంట్ నుంచి కిందకు దూకి చనిపోయారు. ఈ విషయం తెలిసిన వెంటనే మలైకా అరోరా మాజీ భర్త అర్భాజ్ ఖాన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.
ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదన్నారు పోలీసులు. ప్రస్తుతం యాక్సిడెంటల్ డెత్‌గా కేసు నమోదు చేసి ఘటనపై అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. ప్రాథమిక సమాచారం కోసం కుటుంబ సభ్యులను ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.
మహారాష్ట్రలోని థానేలో మలైకా అరోరా జన్మించారు. 11 ఏళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. దీంతో సోదరి అమృతా అరోరా, తల్లి జాయ్స్పాలికార్ప్తో కలిసి మలైకా చెంబూరుకు వెళ్లిపోయారు. మలైకా బాల్యమంతా చెంబూరులోనే గడిచింది. మలైకా తల్లి మలయాళీ క్రిస్టియన్ కాగా, తండ్రి అనిల్ అరోరా పంజాబీ. గతంలో ఆయన ఇండియన్ మర్చంట్ నేవీలో పని చేశారు.