YouTube channel subscription banner header

సెటిలర్ ఎమ్మెల్యే.. బీఆర్ఎస్ పాత ఫార్ములా

Published on

ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీఆర్ఎస్ ప్రాంతీయ వాదాన్ని బయటకు తీస్తుందనే ఆరోపణలు వినిపిస్తుంటాయి. కానీ గతేడాది జరిగిన ఎన్నికల్లో మాత్రం వారికి ఆ అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు పాడి కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ విషయంలో మరోసారి ప్రాంతీయవాదం తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ అనూకూల సోషల్ మీడియా ఈ వ్యవహారాన్ని బాగా హైలైట్ చేస్తోంది. తెలంగాణ ఎమ్మెల్యేపై సెటిలర్ ఎమ్మెల్యే దాడి అంటూ ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. “పదేళ్లు కుక్కిన పేను లెక్క ఉన్న ఆంధ్రా సెటిలర్లు నేడు దాడులకు తెగబడే దాకా వచ్చారంటే పరిస్థితి ఎందాకా వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.” అంటూ బీఆర్ఎస్ భజన చేసే ఓ యూట్యూబ్ ఛానెల్ వాళ్లు ట్వీట్ చేయడం దీనికి పరాకాష్టగా మారింది. ఈ కామెంట్లు ఇప్పుడు ఆంధ్రా వర్సెస్ తెలంగాణ అనే పాత గాయాన్ని రేపుతున్నాయి.

ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన వాళ్లను కడుపులో పెట్టుకుని చూసుకుంటాం అని బీఆర్ఎస్ నేతలు గతంలో చెప్పుకునేవారు. అయితే ఇప్పుడు వాళ్లే అరికెపూడి గాంధీపై సెటిలర్ ఎమ్మెల్యే అనే ముద్రవేస్తున్నారు. బతకడానికి హైదరాబాద్ వచ్చిన వాళ్లు అంటూ కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా మరింత మంట పెట్టేలా ఉన్నాయి. మళ్లీ బీఆర్ఎస్ పాత ఫార్ములా పట్టుకుందని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టేలా మరోసారి తెలంగాణ ఎమ్మెల్యే, సెటిలర్ ఎమ్మెల్యే అనే వివక్ష చూపెడుతున్నారని అంటున్నారు.

ఎందుకిలా..?
బీఆర్ఎస్ టికెట్ పై గెలిచి, కాంగ్రెస్ లో చేరిన అరికెపూడి గాంధీకి బీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో అసలు గొడవ మొదలైంది. అదే రోజు ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంపై కూడా తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఆ తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో అడుగు ముందుకేసి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చీరలు, గాజులు పంపించారు. దీనిపై మహిళా సంఘాలు మండిపడ్డాయి. మహిళల్ని తక్కువచేసి చూపిస్తున్నారంటూ పాడి కౌశిక్ రెడ్డికి కాంగ్రెస్ మహిళా నేతలు చెప్పు చూపించారు. పాడికి పాడె కడతామని హెచ్చరించారు. వివాదం ముదిరినా బీఆర్ఎస్ సైలెంట్ గానే ఉంది. కౌశిక్ రెడ్డి చీరల యాక్షన్ కి బీఆర్ఎస్ నుంచి అధికారిక రియాక్షన్ అస్సలు లేదు. అయితే ఈ వ్యవహారం కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీగా మారిన తర్వాత బీఆర్ఎస్ నేతలు ఎంట్రీ ఇచ్చారు. హరీష్ రావు సహా ఇతర నేతలు అరికెపూడి గాంధీ, తమ ఎమ్మెల్యేపై కౌశిక్ రెడ్డిపై దాడి చేశారని అంటున్నారు. అరికెపూడిని అరెస్ట్ చేయాల్సిందేనంటూ ఆందోళనకు దిగారు.

ఈ ఎపిసోడ్ లో ఎవరిది ఒప్పు, ఎవరిది తప్పు అని ఎవరు తేల్చగలరు. ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. ఒకరింటికి ఇంకొకరు వెళ్తానన్నారు. అరేయ్, ఒరేయ్ అంటూ తిట్టుకున్నారు. వ్యక్తిగత ప్రతిష్టలకు పోయి చివరకు ఆంధ్రా వర్సెస్ తెలంగాణ అనే దాకా సీన్ తీసుకొచ్చారు. బీఆర్ఎస్ కి కూడా ఇలాంటి వ్యవహారమే కావాలి, దాన్ని మరింత సాగదీయాలి. కేసీఆర్ బయటకు రావడం లేదు, కేటీఆర్ తెలంగాణలో లేరు, ఈ దశలో బీఆర్ఎస్ లో ఎవరికి వారే సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సవాళ్లు విసురుతున్నారు. రచ్చ రచ్చ చేస్తున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...