YouTube channel subscription banner header

సీఎం రేవంత్ కి పెద్ద ‘పీట’.. మళ్లీ బీఆర్ఎస్ రభస

Published on

రైతుభరోసా ఇవ్వలేదు..
రుణమాఫీ అందరికీ చేయలేదు..
హాస్టల్స్ లో వసతులు బాలేవు..
వరదల్లో సరిగా పనిచేయలేదు..
ఇలా రకరకాల కారణాలతో తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తోంది ప్రతిపక్ష బీఆర్ఎస్. కానీ ఆ పోరాటమంతా సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నట్టు కనపడుతోంది. తాజాగా మరోసారి ఓ సున్నిత అంశాన్ని తెరపైకి తెచ్చి హడావిడి చేసే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నేతలు. వినాయక చవితి పూజ సందర్భంగా ఆ దేవుడి సాక్షిగా బహుజనులకు అన్యాయం జరిగిందని అన్నారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన గణపతి పూజలో పీసీసీ కొత్త అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ని కింద కూర్చోబెట్టి, రేవంత్ రెడ్డి పెద్ద పీట వేసుకున్నారనేది బాల్క సుమన్ వేసిన ట్వీట్ సారాంశం. అగ్ర వర్ణాలకు చెందిన సీఎం పెద్ద పీట వేసుకోవడంతో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న బీసీ నాయకుడికి అవమానం జరిగిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు.

గతంలో యాదాద్రి ఆలయంలో దళిత వర్గానికి చెందిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు కూడా ఇలాగే అవమానం జరిగిందని బీఆర్ఎస్ నేతలు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అగ్ర వర్ణాల నాయకులకు పెద్ద పీటలు వేశారని, డిప్యూటీసీఎం అయినా కూడా దళితుడు కావడం వల్లే భట్టికి చిన్న పీట వేసి అవమానించారని అన్నారు. అప్పటికప్పుడే వారికి కాంగ్రెస్ నుంచి గట్టి సమాధానం వచ్చింది. భట్టి విక్రమార్క కూడా ఈ వివాదాన్ని తేలిగ్గా తీసుకున్నారు. పూజకు ఆలస్యంగా రావడం వల్లే అక్కడ పెద్ద పీట మిస్సైందని అన్నారు.

ప్రభుత్వాన్ని విమర్శించడానికి అవకాశం లేక ఇలా బీఆర్ఎస్ నేతలు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారంటూ కాంగ్రెస్ కౌంటర్లిస్తోంది. తమ పార్టీ నేతలెవరూ అవమానంగా ఫీలవని విషయాలను బీఆర్ఎస్ రాద్ధాంతం చేయాలని చూడటం వారి రాజకీయ దిగజారుడు తనానికి పరాకాష్ట అంటున్నారు కాంగ్రెస్ నేతలు. గతంలో కూడా డిప్యూటీ సీఎం భట్టి ఫొటో చిన్నదిగా వేశారని, కొన్నిచోట్ల ఫ్లెక్సీల్లో ఆయన పేరు లేదని, ప్రొటోకాల్ పాటించడం లేదని, ఆ విషయంలో భట్టి అలిగారని కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో రచ్చ చేసింది. పీసీసీ కొత్త అధ్యక్షుడితో ఇప్పుడు కొత్త వివాదం తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు బీఆర్ఎస్ నేతలు. నెటిజన్లు మాత్రం ఇలాంటి ట్వీట్లకు కాస్త ఘాటుగానే బదులిస్తున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...