ఎన్నికల సమయంలో చాలా సంస్థలు సర్వే నిర్వహిస్తూ ఉంటాయి. ఇది సర్వ సాధారణం. ఒక్కో సంస్థ ఒక్కో రకంగా సర్వే ఫలితాలను విడుదల చేస్తాయి. అయితే అన్ని సర్వేలను మనం గుడ్డిగా నమ్మలేం. ఎందుకంటే.. కొన్ని సర్వే సంస్థలు అధికార పార్టీకి అనుకూలంగా ఇస్తే.. కొన్ని ప్రతిపక్షాలకు అనుకూలంగా ఇస్తాయి. కొన్ని సర్వే సంస్థలు అయితే.. అబద్ధాన్ని కూడా నిజం అనిపించేలా అందరూ నమ్మేలా ఈ సర్వేలను ఇస్తాయన్న మాట. వాటినే పెయిడ్ సర్వేలు అంటాం.
ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు అంటారా? తాజాగా ఇలాంటి పెయిడ్ సర్వేనే టీడీపీ ఒకటి చేయించింది. ఏపీలో మరి కొద్ది రోజుల్లో పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ ఎన్నికలకి సంబంధించిన ప్రముఖ సీ ఓటర్ అనే సంస్థ ఏపీలో పార్లమెంట్ ఎన్నికలపై మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అధికార పార్టీ అయిన వైసీపీకి 8 పార్లమెంట్ స్థానాలు.. ప్రతిపక్ష పార్టీ అయిన టీడీపీకి 17లోక్ సభ స్థానాలు వస్తాయని తెలిపింది.
ఇదే సంస్థ గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా అప్పటి అధికార పార్టీ అయిన టీడీపీకి 14 ఎంపీ స్థానాలు, 100 ఎమ్మెల్యే స్థానాలు వస్తాయని అప్పట్లో వెల్లడించింది. తీరా ఎన్నికల ఫలితాలు రివర్స్ అయ్యాయి. టీడీపీకి 3ఎంపీ, 23 ఎమ్మెల్యే స్థానాలు రాగా.. వైసీపీకి 151ఎమ్మెల్యే స్థానాలు.. 23 ఎంపీ స్థానాలు వచ్చాయి. అప్పటి నుండి సర్వేల పేరుతో సీ ఓటర్ వెల్లడిస్తున్న ఏ ఒక్క సర్వే ఫలితాలు నిజం కాలేదు.
గతేడాది మధ్యప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల గురించి ఫ్రీ పోల్స్.. ఎగ్జిట్ పోల్స్ పేరుతో సర్వేలు నిర్వహించింది. ఆ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి 118 – 130 స్థానాలు వస్తాయని ప్రీ పోల్ పేరుతో ఒకసారి.. మరోకసారి ఎగ్జిట్ పోల్ పేరుతో సర్వే నిర్వహించి కాంగ్రెస్‌కి 113 -137 స్థానాలు వస్తాయని ఫలితాలు వెల్లడించింది. తీరా ఎన్నికల ఫలితాల్లో కనీసం ఆ సర్వే ఫలితాలకు దరిదాపుల్లో లేకుండా కాంగ్రెస్‌కు కేవలం 66 స్థానాలనే కట్టబెట్టి బీజేపీకి 163 స్థానాలతో అధికారాన్ని అప్పగించారు.
మరోవైపు చత్తీస్‌గఢ్‌లో ఇదే విధంగా ఫలితాలను వెల్లడించి సీ ఓటర్ సంస్థ కంగుతిన్నది. రీసెంట్ సర్వే కూడా నిజం కాదు అని ఇప్పటికే అందరికీ అర్థమై ఉంటుంది. కేవలం.. చంద్రబాబు చేయించిన పెయిడ్ సర్వే అని స్ఫష్టంగా అర్థమవుతోంది. ఇలాంటి పెయిడ్ సర్వేల వల్ల.. కొద్దిసేపు ఆ పార్టీ నేతలు సంబరపడటం తప్ప.. పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదు. ఈ సత్యం చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.