YouTube channel subscription banner header

జగన్‌ చేసిన మేలును మైనారిటీలు మరువగలరా..?

Published on

వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీల సాధికారత, సంక్షేమం లక్ష్యంగా పనిచేస్తూ వస్తున్నారు. మైనారిటీలకు రాజకీయంగా ప్రాతినిధ్యం కల్పిస్తూనే, మైనారిటీల అభివృద్ధికి, సంక్షేమానికి పలు పథకాలను అమలు చేస్తున్నారు. చెప్పాలంటే 2019 నుంచి మైనారిటీలకు సంబంధించి సువర్ణాధ్యాయం ప్రారంభమైంది. జగన్‌ మైనారిటీలకు ఇస్తున్న ప్రాధాన్యం ఏమిటో చూద్దాం.

రాజకీయ సాధికారత

వైఎస్‌ జగన్‌ 2014 ఎన్నికల్లో నలుగురు ముస్లింలకు ఎమ్యెల్యే టికెట్లు ఇచ్చి ముగ్గురిని గెలిపించుకున్నారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్‌ జగన్‌ దేశంలోనే ప్రప్రథమంగా ఒక ముస్లిం నేతకు డిప్యూటీ సిఎం పదవి ఇచ్చారు. అంతేకాకుండా ఓ ముస్లిం మహిళకు శాసన మండలి డిప్యూటీ చైర్‌ పర్సన్‌ పదవి ఇచ్చారు.

వైఎస్‌ జగన్‌ 14 మంది మైనారిటీలకు వివిధ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు ఇచ్చారు. 33 మందికి వివిధ డైరెక్లర్ల పదవులు ఇచ్చారు. గ్రామీణ స్థానిక సంస్థలకు సంబంధించి 11 మంది మండలాధ్యక్షులు, 13 మంది మండల ఉపాధ్యక్షులు, 243 మంది కోఆప్షన్‌ సభ్యులు అయ్యారు.

నగర పాలక సంస్థలకు సంబంధించి ఇద్దరు మేయర్లు, ఒక‌రు డిప్యూటీ మేయర్‌ అయ్యారు. మున్సిపాలిటీలకు సంబంధించి 9 మంది మున్సిపల్‌ చైర్మన్లు, అత్యధిక సంఖ్యలో వార్డు మెంబర్లు అయ్యారు. కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా మైనారిటీలకు అవకాశం కల్పించారు. ఆ రకంగా మైనారిటీలకు సాధికారత కల్పించిన ఘనత వైఎస్‌ జగన్‌కు దక్కుతుంది.

మైనారిటీల విద్యకు ప్రాధాన్యం

దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయని విధంగా ఉర్దూ మీడియంలో చదివే విద్యార్థులకు మిర్రర్‌ ఇమేజ్‌ కాన్సెప్ట్‌తో ఉర్దూ, ఇంగ్లీష్‌ ద్విభాషా విధానంలో విద్యాబోధన చేస్తున్నారు. ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ మైనారిటీస్‌ సెంటర్‌ ద్వారా వివిధ ఉపాధి శిక్షణ కార్యక్రమాలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇందుకు రూ.12.94 కోట్లు వ్యయం చేస్తోంది,

మైనారిటీల సంక్షేమం

గత చంద్రబాబు ప్రభుత్వం మైనారిటీ వర్గాల సంక్షేమం కోసం 2014 నుంచి 2019 వరకు కేవలం రూ. 2,665 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 నుంచి 2023 వరకు మైనారిటీల కోసం మొత్తం డీబీటీ ద్వారా రూ.12,613.28 కోట్లు కాగా నాన్ డీబీటీ ద్వారా రూ.10,801.02 కోట్లు. అంటే మొత్తం 23,414 కోట్ల రూపాయల మేర మైనారిటీలకు వివిధ పథకాల కింద జగన్‌ ప్రభుత్వం అందించింది. తద్వారా 50 లక్షల మంది మైనారిటీ వర్గాలకు లబ్ధి చేకూరింది.

మసీదుల్లో సేవలందించే ఇమామ్‌లు, మౌజన్‌లకు నెలసరి గౌరవ వేతనం కింద గత చంద్రబాబు ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.12 కోట్ల బకాయిలను కూడా జగన్‌ ప్రభుత్వం చెల్లించింది. దానికితోడు రూ.300.68 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. హజ్‌ యాత్రికులకు జగన్‌ ప్రభుత్వం రూ.19.54 కోట్ల ఆర్థిక సాయం అందించింది. ఆరోగ్యశ్రీ పథకం కింద రూ.486.22 కోట్ల సాయం చేసింది.

కరోనా కష్టకాలంలో మసీదుల్లో సేవలందించే ఇమామ్‌, మౌజన్‌లకు రూ.20.74 కోట్ల ఆర్థిక సాయం చేసింది. తెల్ల రేషన్‌ కార్డులున్న మైనారిటీలకు రూ.81.03 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయాన్ని జగన్‌ ప్రభుత్వం అందించింది.

డీబీటీ

వివిధ పథకాల ద్వారా మైనారిటీలకు అందించిన సహాయం ఈ కింద విధంగా ఉంది.
జగనన్న అమ్మ ఓడి పథకం కింద‌ రూ.1806.27 కోట్లు
జగనన్న విద్యాదీవెన పథకం కింద రూ.736.15 కోట్లు
జగనన్న వసతి దీవెన పథకం కింద రూ. 302.05 కోట్లు
జగనన్న విదేశీ విద్యా దీవెన కింద రూ.23.27 కోట్లు
వైఎస్సార్‌ రైతు భరోసా కింద రూ.1051.99 కోట్లు
వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల కింద రూ.26.89 కోట్లు
వైఎస్సార్‌ ఉచిత పంట బీమా కింద రూ.141.11 కోట్లు
వైఎస్సార్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.41.62 కోట్లు
మత్స్యకార భరోసా పథకం కింద రూ.1.79 కోట్లు
వైఎస్సార్‌ సున్నా వడ్డీ (జిహెచ్‌డి) కింద రూ.317.29 కోట్లు
వైఎస్సార్‌ పింఛను కానుక పథకం కింద రూ.4,521.73 కోట్లు
వైఎస్సార్‌ చేయూత పథకం కింద రూ.1,192.66 కోట్లు
వైఎస్సార్‌ ఆసరా పథకం కింద రూ.1,019.91 కోట్లు
వైఎస్సార్‌ బీమా పథకం కింద రూ.131.46 కోట్లు.
వైఎస్సార్‌ నేతన్న పథకం కింద రూ.22.66 కోట్లు.
జగనన్న చేదోడు పథకం కింద రూ.56.12 కోట్లు
వైఎస్సార్‌ నేస్తం పథకం కింద రూ.114 కోట్లు
వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం కింద రూ.114 కోట్లు
వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకం కింద రూ.65.99 కోట్లు
అగ్రి గోల్డ్‌ బాధితులకు ఆర్థిక సహాయం కింద రూ.38.03 కోట్లు
వైఎస్సార్‌ షాదీ తోఫా పథకం కింద. రూ.38.47 కోట్లు

నాన్ డీబీటీ

జగనన్న తోడు పథకం కింద రూ. 14.70 కోట్లు
జగనన్న గోరు ముద్ద పథకం కింద రూ.139.83 కోట్లు
వైఎస్సాఆర్‌ సంపూర్ణ పోషణ పథకం కింద రూ.513.46 కోట్లు
జగనన్న విద్యా కానుక కింద రూ.225.47 కోట్లు
జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.3,519.20 కోట్లు
జగనన్న కాలనీల్లో స్థల సేకరణకు, అభివృద్ధికి రూ.6,305.80 కోట్లు
వైఎస్సాఆర్‌ వెలుగు పథకం కింద రూ.6.48 కోట్లు
ఎనిమిదవ తరగతి చదివే విద్యార్థులకు బైజూస్‌ సాఫ్ట్‌వేర్‌తో కూడిన ట్యాబ్‌ల పంపిణీకి రూ.31.69 కోట్లు
మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్లు(ఎండియుఎస్‌) పథకం కింద రూ.31.45 కోట్లు

ఇంతగా ప్రయోజనం పొందుతున్న మైనారిటీలు వైఎస్‌ జగన్‌ పట్ల అనుకూలంగా ఉంటారని భావించవచ్చు. కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్పదు కాబట్టి బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంతో జగన్‌ సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అంతేగానీ, బీజేపీతో జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏ విధమైన పొత్తులోకి వెళ్లలేదు, వెళ్లదు కూడా. అందువల్ల జగన్‌ ప్రభుత్వం ద్వారా తాము ప్రయోజనం పొందతున్నామా, లేదా అనేది మాత్రమే మైనారిటీలు ఆలోచించాల్సిన అవసరం ఉంది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...