దేశవ్యాప్తంగా 18 OTT ఫ్లాట్‌ఫామ్స్‌ను కేంద్రం నిలిపేసింది. ఆయా ఓటీటీల్లో అసభ్య కంటెంట్‌ను ప్రసారం చేస్తున్నందుకు ఈ చర్యలు తీసుకుంది. దీంతోపాటు 19 వెబ్సైట్లు, 18 యాప్‌లను తొలగించింది. 57 సోషల్ మీడియా హ్యాండిల్స్‌ను కూడా నిలిపేసింది. ‘సృజనాత్మక వ్యక్తీకరణ’ ముసుగులో అశ్లీలత, అసభ్యతతో కూడిన కంటెంట్‌ను ప్రచారం చేయవద్దని కేంద్రం పలుమర్లు హెచ్చరించింది. అయినా కొన్ని ఓటీటీలు పట్టించుకోలేదు. దాంతో 18 OTT ప్లాట్‌ఫారమ్‌లను తాజాగా తొలగించింది కేంద్రం.
బ్యాన్ అయిన ఓటీటీల లిస్ట్ ఇదే:
X Prime, Hot Shots VIP, Uncut Adda, MoodX, Prime Play, Voovi, Besharams, Mojflix, Dreams Films, Neon X VIP, Yessma, Hunters, Rabbit, Fugi, Tri Flicks, Xtramood, Chikooflix, Nuefliks.
ఈ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రసారం అవుతున్న కంటెంట్‌లో ఎక్కువ భాగం అశ్లీలతే ఉంది. అంతే కాకుండా మహిళలను కించపరిచే విధంగా చిత్రీకరించిన పలు సినిమాలు ఉన్నట్లు కేంద్రం గుర్తించింది. వీటివల్ల సమాజంలో సంబంధాలు దెబ్బతింటాయని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ ఓటీటీ యాప్‌లను కొన్ని కోట్ల మంది డౌన్లోడ్ చేసుకుని వాడుతున్నట్లు కేంద్రం వివరించింది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఈ యాప్స్‌తో పాటు వెబ్‌సైట్స్ భారత్‌లో బ్యాన్ అయ్యాయి.