YouTube channel subscription banner header

నీకున్నంత ‘తెలివి’ జగన్‌కు లేదయ్యా చంద్రం..

Published on

దేన్నయినా ప్రచారానికి వాడుకోవాలనే తెలివితేటలు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఉన్నంతగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు లేవు. ప్రతిదాన్నీ ప్రచారానికి వాడుకునేతత్వం చంద్రబాబుది. చేతల కన్నా ప్రచారానికే ప్రాధాన్యం ఇచ్చేతత్వం యనది. జగన్‌పై దాడికి సంబంధించిన ఫొటోలు విడుదల కావడంపై ఎల్లో మీడియా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేస్తోంది. సానుభూతి పొందాలని జగన్ చూస్తున్నారనే ప్రచారాన్ని తెర మీదికి తెస్తోంది. కనీసమైన సానుభూతి లేకుండా డ్రామాలకు తెరలేపుతోంది. అయినా, చంద్రబాబును గద్దెనెక్కించే ఏకైక లక్ష్యంతో తప్పుడు రాతలు రాస్తున్న ఎల్లో మీడియాకు సానుభూతి ఉంటుందని అనుకోవడం భ్రమ మాత్రమే.

దాడి జరిగిన తర్వాత జగన్ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. అప్పుడు ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది ఆయనతో ఫొటో తీయించుకున్నారు. ఆ ఫొటో మీడియాలో ప్రచురితమైంది. దాంతో ఎల్లో మీడియా జగన్‌పై రెచ్చిపోతోంది. ఆస్ప‌త్రిలోకి ఫొటోగ్రాఫర్‌ను ఎలా అనుమతిస్తారంటూ తప్పు పడుతోంది. మరి చంద్రబాబు చేసిందేమిటి?

తాజాగా జరిగిన చంద్రబాబు ఉదంతాన్నే తీసుకుందాం. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయిన చంద్రబాబు ఆరోగ్యాన్ని సాకుగా చూపించి బెయిల్ మీద జైలు నుంచి విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఎల్వీ ప్రసాద్ ఐ ఇనిస్టిట్యూట్‌లో కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నారు. కుడి కంటిపై కట్టుతో ఆయన ఫొటో సెషన్ ఏర్పాటు చేసుకున్నారు.

ఆసుప్రతిలోని ఆపరేషన్ థియేటర్లో ఫొటో షూట్లు ఎక్కడైనా జరుగుతాయా? అలా ఫొటోలు దిగింది సానుభూతి పొందడానికి కాక మరేమిటి? నిజానికి ఆపరేషన్ థియేటర్లోకి ఫొటోగ్రాపర్లను అనుమతించకూడదు. అయినా ఫొటో షూట్లు చేశారంటే దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఏ యాంగిల్ లో కెమెరా పెట్టాలి, ఎలా తీయాలి అనే విషయాలపై పకడ్బందీగా ప్లాన్ వేసుకుని ఫొటోలు తీసుకుని ప్రచురింపజేసుకున్నారు. దీన్ని చంద్రబాబు, ఎల్లో మీడియా డ్రామాలో క్లైమాక్స్ సీన్ అని అనుకోవాలా? జగన్‌ను ప్రశ్నించిన ఎల్లో మీడియా అప్పుడు చంద్రబాబును ఎందుకు తప్పు పట్టలేదు. చంద్రబాబు చేస్తే ఒక్కటి, జగన్ విషయంలో మరోటినా? చంద్రబాబు సానుభూతి పొందడానికి ఏమైనా చేయవచ్చుననే పాక్షిక కోణం ఎల్లో మీడియా ఆలోచనల్లో లేదా?

ఈ సంఘన మాత్రమే కాదు, గతంలో కూడా చంద్రబాబు ఆడిన డ్రామాలు ఉన్నాయి. 2003లో అలిపిరి వద్ద తిరుమల వెళ్తుండగా చంద్రబాబుపై నక్సలైట్లు దాడి చేశారు. అలిపిరి పేలుడు తర్వాత చంద్రబాబు కట్టు కట్టుకుని చాలా రోజులు ప్రజలకు దర్శనమిస్తూ వచ్చారు. సానుభూతి వస్తుందని ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. ఈ సమయంలో చంద్రబాబు ఒక్కోసారి ఒక్కో చేతికి కట్టు తగిలించుకుని తిరుగుతూ వచ్చారు. దాన్ని అప్పటి కాంగ్రెస్ సీనియర్ నేత రోశయ్య గమనించి, గమ్మత్తయిన వ్యాఖ్య చేశారు. నిమ్స్ డాక్టర్లు చంద్రబాబుకు పొరపాటున ఒక చేతికి బదులు మరో చేతికి కట్టు తగిలిస్తున్నారని ఆయన అన్నారు. ఆ తర్వాత చంద్రబాబు కట్టు లేకుండా తిరిగారు.

రాజమండ్రి జైలులో ఉన్నప్పుడు ఎల్లో మీడియా రాసిన కట్టు కథలు సానుభూతి కోసం కాకపోతే మరేమిటి? జైల్లో చంద్రబాబును హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించాయి. చంద్రబాబుకు దోమలు కుడుతున్నాయని సానుభూతి వార్తలు రాశాయి. ఏమైనా చంద్రబాబు మాదిరిగా జగన్‌కు డ్రామాలు ఆడే అలవాటు లేదనేది స్పష్టం.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...