YouTube channel subscription banner header

సీట్లు అమ్ముకోవడమే బాబు లక్ష్యం – చంద్రబాబుపై కేశినేని నాని కామెంట్స్‌

Published on

రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యే సీట్లు అమ్ముకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నాడని వైసీపీ నేత కేశినేని నాని విమర్శించారు. నారా లోకేష్‌ ఒక పనికిమాలిన వ్యక్తి అని, అలాంటి వ్యక్తిని చంద్రబాబు మంత్రిని చేశాడని మండిపడ్డారు. విజయవాడలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు ధనికుల పక్షపాతి అని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు.

రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని ప్రజలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబని కేశినేని నాని మండిపడ్డారు. సీఎం వైఎస్‌ జగన్‌ పేదల పక్షపాతి అని, ఒక్క విజయవాడ నగరంలోనే రూ.325 కోట్ల రుణమాఫీ చేశారని తెలిపారు. అంబేద్కర్‌ విగ్రహం నిర్మాణం పూర్తి చేసిన చూపించిన నాయకుడు సీఎం జగన్‌ అని ఆయన చెప్పారు. చంద్రబాబు మాత్రం అంబేద్కర్‌ విగ్రహ నిర్మాణం అని చెప్పి శంకుస్థాపన కూడా చేయలేదని గుర్తుచేశారు.

రాష్ట్రంలోని పిల్లలందరూ చదువుకోవాలని కాంక్షించే వ్యక్తి ముఖ్యమంత్రి జగన్‌ అని, చంద్రబాబు మాత్రం ధనికుల పక్షపాతి అని నాని వివరించారు. పచ్చ మీడియాను అడ్డుపెట్టుకొని వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు నెగెటివ్‌ ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు. 2014, 2019 ఎన్నికల్లో తాను ఉంటేనే తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ గెలిచాడని, తాను లేకపోతే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ జీరో అని ఈ సందర్భంగా కేశినేని నాని తెలిపారు. విజయవాడ తూర్పు స్థానం నుంచి 25 వేల మెజారిటీతో అవినాష్‌ గెలవబోతున్నాడని ఆయన స్పష్టం చేశారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...