రాజకీయాల్లో వారసులు రావడం సహజం. తల్లిదండ్రుల తర్వాత వారి వారసులు రాజకీయాల్లోకి అడుగుపెట్టి.. సత్తా చాటుతున్నవారు చాలా మంది ఉన్నారు. అయితే.. చంద్రబాబుకి మాత్రం ఈ విషయంలో పెద్ద లోటు ఉందనే చెప్పాలి. ఆయన ఎన్ని సంవత్సరాలు రాజకీయాల్లో చురుకుగా ఉన్నా.. తన తర్వాత వారసుడు తన కొడుకు అని ధైర్యంగా మాత్రం చెప్పులేకపోతున్నారు. గతంలో జరిగిన సంఘటనల దృశ్యా ఆయన తన ముద్దుల కొడుకు లోకేష్‌ని ఈ ఎన్నికల వేళ కాస్త దూరంగా ఉంచుతున్నారనే ప్రచారం జరుగుతోంది. లోకేష్ మీద నమ్మకంలేకనే ఇలా చేస్తున్నారనే మాటలు ఎక్కువగా వినపడుతున్నాయి. అలాంటి అభిప్రాయం కలగడానికి కారణాలు కూడా లేకపోలేదు.
ఈ ఎన్నికల్లో లోకేష్ సేవలను పెద్దగా వాడుకోవడం లేదు. లోకేష్ తెర వెనకకే ఉండిపోయారు. సత్తా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లాంటి నాయకులు ఎక్కడ పోటీకి వస్తారో అని చంద్రబాబు ముందే పక్కనపెట్టారు. సరే.. తన కొడుకు లోకేష్ ఏమైనా పొడిచేస్తాడా అంటే.. లోకేష్ నాయకత్వంలో పార్టీ పెద్దగా పుంజుకోలేదు. లోకేష్‌కు జగన్‌తో సరితూగే సత్తా లేదని చంద్రబాబుకి ఎప్పుడో అర్థమైపోయింది.
టీడీపికి జీవం పోయడానికి జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలోకి ఆహ్వానించాలని పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరిలాంటి వాళ్లు కోరుతున్నా, చంద్రబాబు వినడం లేదు. జూనియర్ ఎన్టీఆర్‌ను పక్కకు తప్పించే క్రమంలో కొడాలి నాని, వల్లభనేని వంశీకృష్ణ వంటి నాయకులను వదులుకోవడానికి కూడా ఆయన వెనకాడలేదు.
నారా లోకేష్ అంతా తానై పార్టీని నడిపించడానికి కొద్ది కాలం పనిచేశారు. కానీ పెద్దగా ఆయన కృషి ఫలించలేదు. నారా లోకేష్ వ్యవహార శైలి వల్ల కొంత మంది సీనియర్ నాయకులు పార్టీకి దూరమయ్యే పరిస్థితి కూడా వచ్చింది. వచ్చే ఎన్నికలు చంద్రబాబు భవిష్యత్తునే కాకుండా టీడీపీ భవిష్యత్తును కూడా నిర్ణయిస్తాయి, నారా లోకేష్‌కు నాయకత్వం అప్పగించే ప్రక్రియను కూడా నిర్ణయిస్తాయి. అందువల్ల చంద్రబాబు లోకేష్ వల్ల కాదని భావించి, ఆయనపై నమ్మకం లేక తానే ముందుండి అన్నీ నడిపిస్తున్నట్లు తోస్తోంది.
వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తే నారా లోకేష్‌కు తన వాసత్వాన్ని అందించే విషయంపై ఆలోచించవచ్చునని ఆయన అనుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే, వైఎస్ జగన్‌కు ఉన్న నాయకత్వ లక్షణాలు లోకేష్‌కు లేకపోవడం పెద్ద మైనస్ పాయింట్‌గా కనిపిస్తోంది. జగన్‌తో సరితూగే సత్తా లోకేష్‌కు లేవనేది అందరికీ తెలిసిన విషయమే. ఇటువంటి స్థితిలో జగన్‌కు నారా లోకేష్‌ను పోటీ పెట్టడం చంద్రబాబుకు ఇష్టం లేదు. తానే జగన్‌ను ఎదుర్కోవడానికి పవన్ కల్యాణ్‌ను అరువు తెచ్చుకున్నారు. లోకేష్ మీద నమ్మకం ఉంటే.. పవన్ ఊసు కూడా చంద్రబాబు ఎత్తేవాడు కాదు అనేది అక్షర సత్యం.