YouTube channel subscription banner header

బినామీ రమేష్.. బాబుతో ‘కమ్మ’ని బంధం

Published on

బినామీ రమేష్ అలియాస్ సీఎం రమేష్.. ఏపీలో టీడీపీ వ్యవహారాలన్నీ తెరవెనుక చక్కబెడుతున్న బీజేపీ నాయకుడు. బీజేపీ నాయకుడు అనడం కంటే బీజేపీలో ఉన్న టీడీపీ కోవర్టు అని చెప్పుకోవడం కరెక్ట్. ఈ కోవర్టు, బినామీ రాజకీయ ప్రస్థానం సారా వ్యాపారంతో మొదలైంది. వెలమ సామాజిక వర్గానికి చెందిన సీఎం రమష్ కడప జిల్లాలో తండ్రితో కలసి సారా వ్యాపారం చేస్తూ అనేక కేసులు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సారా వ్యాపారి కాస్తా ముదిరి రాజకీయ నాయకుడయ్యారు.

బాబుతో ‘కమ్మ’ని బంధం
చిత్తూరు జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత సీఎం రమేష్‌కు చంద్రబాబుతో పరిచయం ఏర్పడింది. కుప్పం వచ్చినప్పుడల్లా చంద్రబాబుకి జేజేలు కొట్టించడం, స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించడం ద్వారా బాబుకి మరింత దగ్గరయ్యారు సీఎం రమేష్. 1995లో ఎన్టీఆర్‌కి వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యాక సీఎం రమేష్ దశ కూడా తిరిగింది. ఆ తర్వాత నాలుగేళ్లకు రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీ మొదలు పెట్టారు రమేష్. బాబుకి బినామీగా మారిపోయారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు బినామీగా వేల కోట్లు దోచుకున్న సీఎం రమేష్.. కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక మరింత చెలరేగిపోయారు. 2014 -19 మధ్య కాలంలో సీఎం రమేష్‌కు రూ.3,658 కోట్ల పనుల్ని అడ్డదారిలో అప్పగించారు బాబు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనుల కోసం రూ.522 కోట్లు, హంద్రీ-నీవా సుజల స్రవంతి ఫేజ్‌–2 కోసం రూ.1000 కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ విస్తరణ పనుల కోసం రూ.195 కోట్లు, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ 34వ ప్యాకేజీ రూ.234 కోట్లు, జీఎన్‌ఎస్‌ఎస్‌ ప్రాజెక్టులో రూ.350 కోట్లు, వెలిగొండ టన్నెల్‌ రూ.270 కోట్లు, తెలుగు గంగ లైనింగ్‌ పనులు రూ.289 కోట్లు, గుంతకల్లు బ్రాంచ్‌ కెనాల్‌ రూ.172 కోట్లు, వంశధార ప్రాజెక్టు పనులు రూ.120 కోట్లు, ఆర్టీపీపీ 6వ ప్లాంటు నిర్మాణ పనులు రూ.400 కోట్లు, గండికోట ప్రాజెక్టు పునరావాస నిర్మాణం పనులు రూ.106 కోట్లు.. ఇలా రిత్విక్ ప్రాజెక్ట్స్ కి పనుల అప్పగింత సాగింది. బినామీ సొమ్ము తిరిగి బాబుకి ఫలహారంగా మారింది.

బినామీ రమేష్, చంద్రబాబు వల్ల బాగానే లాభపడ్డారు. 2 సార్లు ఆయన్ను రాజ్యసభకు ఎంపిక చేశారు. రమేష్ కూడా స్వామిభక్తి అలాగే చూపించారు. ఏపీలో టీడీపీ ఓడిపోయిన తర్వాత చంద్రబాబు సూచనతో బీజేపీలో చేరిన రమేష్, సుజనా చౌదరి.. బాబు డైరక్షన్‌లోనే అక్కడ పనిచేశారు. ఆ తర్వాత ఇప్పుడు కూటమిలో భాగంగా అనకాపల్లి లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్నారు సీఎం రమేష్.

సీఎం ర‌మేష్ బీజేపీలో చేర‌క‌ముందు కేంద్రంలో ఉన్న బీజేపీకి నిర‌స‌న తెలిపే కార్య‌క్ర‌మాల్లో న‌ల్ల చొక్కాలు వేసుకుని నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేసిన‌ప్పుడు బీజేపీని, బీజేపీ నాయ‌కుల్ని చివ‌ర‌కు అమిత్ షా, మోదీల‌ను కూడా దుర్భాష‌లాడ్డాడు. టీవీ డిబెట్ల‌లో బీజేపీని, బీజేపీ త‌రుపున చ‌ర్చ‌లో పాల్గొన్న‌వారిని ఎంత నీచంగా మాట్టాడాడో ఆ ప్రోగ్రాం చూసిన‌వారికి తెలుసు. త‌న‌కు పుట్టిల్లులాంటి ఆంధ్ర‌జ్యోతిలో ఆయ‌న బీజేపీకి వ్య‌తిరేకంగా ఎలా చెల‌రేగిపోయాడో అంద‌రం చూసిందే.

స్వామిభక్తి..
2017 ఎమ్మెల్సీ పోటీలో ఉన్న వివేకాను ఓడించారని షర్మిల, జగన్‌పై నిందలు వేస్తున్నారు కానీ, దానికి అసలు కారణం తానేనని సీఎం రమేష్ ఇప్పటికే పలుమార్లు ఇంటర్వ్యూల్లో స్పష్టం చేశారు. బాబు కోసం ఏ పని చేయడానికైనా, ఎంతకి దిగజారడానికైనా సీఎం రమేష్ సిద్ధం. ఇప్పుడు బీజేపీలో ఉన్నా కూడా బాబు కోసం పనులు చక్కబెడుతున్నారాయన. ప్రశాంత్ కిషోర్, షర్మిల, సునీతలకు స్పెషల్ ఫ్లైట్లు ఏర్పాటు చేస్తూ చంద్రబాబు తరపున రంగంలోకి దిగారు. బినామీ రమేష్‌ని తన రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నారు చంద్రబాబు. సారా వ్యాపారి స్థాయి నుంచి బాబు సాయంతో బడా కాంట్రాక్టర్‌గా ఎదిగిన సీఎం రమేష్ తన స్వామి భక్తి చూపిస్తున్నారు.

ప‌చ్చి అవ‌కాశ‌వాది..
సీఎం ర‌మేష్ త‌న స‌క్సెస్ కోసం ఎంత‌కైనా దిగ‌జారుతాడు. ప‌చ్చి అవ‌కాశ‌వాది.. ఏ మాత్రం విలువ లేని వ్య‌క్తి . చివ‌ర‌కు త‌న కులం విష‌యంలోనూ ఇప్పుడు అబ‌ద్దాలు చెబుతున్నాడు. అమాయ‌కులైన ఉత్త‌రాంధ్ర ప‌జ‌ల్ని మోసం చేస్తున్నాడు. తాను ఎంపీగా పోటీ చేస్తున్న‌ నియోజ‌క‌వ‌ర్గంలో 4 ల‌క్ష‌ల మంది కొప్పుల వెల‌మ ఓట‌ర్లు ఉన్నారు. దాంతో ఆయ‌న త‌న కుల‌మే మార్చేశాడు. వెల‌మ సామాజిక‌వ‌ర్గానికి చెందిన సీఎం ర‌మేష్‌.. ఇప్పుడు అవ‌స‌రాల దృష్ట్యా కొప్పుల వెల‌మ‌గా మారిపోయాడు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...