YouTube channel subscription banner header

చంద్రబాబు ప్లేటు ఫిరాయిస్తున్నాడెందుకు..?

Published on

ఒక మాజీ ముఖ్యమంత్రి క్రేజీగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు గడగడలాడుతున్నాడు. వజవజ వణుకుతున్నాడు. ఎందుకీ భయం.! జగన్‌ పాపులారిటీ, జనం లక్షల్లో జగన్‌ వెంట నడుస్తూ ఉండడం. జగన్ని ఓడిస్తా అంటూ ‘మూడు పార్టీల పొత్తు’ అని విర్ర‌వీగిన కొద్దిరోజులకే అసమ్మతి, తిరుగుబాట్లు జనసేన, తెలుగుదేశం, బీజేపీలను కుంగదీయడం. దాంతో చంద్రబాబు తిక్కతిక్కగా మాట్లాడుతున్నాడు. మేం అధికారంలోకి రాగానే ఇసక ఫ్రీగా, అంటే ఉచితంగా ఇస్తాం అంటున్నాడు. సామాన్య జనానికి కావాల్సింది ఇసకా..? బియ్యమూ, కందిపప్పు, పంచదారా కాదు, ఇసక ఇస్తాడట.

ఇసక ఎవరిక్కావాలి..? కాంట్రాక్టర్లకి, రియల్‌ ఎస్టేట్‌ వాళ్లకి, ఇళ్లూ, విల్లాలూ అనేక అంతస్తుల భవనాలూ నిర్మించే కోటీశ్వరులకు ఇసక అవసరం. పాలూ, క్రీంలూ అమ్ముకునే చంద్రబాబు ఎప్పుడూ వ్యాపారస్తుల వైపే ఉంటాడు. జనాన్ని మాత్రం కాల్చుకు తింటాడు. ఆ మధ్య వలంటీర్ల వ్యవస్థ ఒక కుట్ర అనీ, వలంటీర్లు అంతా వైసీపీ కార్యకర్తలేననీ తెగ తిట్టిన బాబు, ఆ వ్యవస్థని రద్దు చేయను అనీ, వాళ్ల ఉద్యోగాలు పోగొట్టే పని చేయనని మాట మార్చాడు. అంతేనా..? సంక్షేమం కోసం జగన్‌ డబ్బు పంచడాన్ని దారుణంగా విమర్శించిన బాబు, తాను అధికారంలోకి వస్తే డబ్బు పంచే పని కొనసాగుతుందని హామీ ఇస్తున్నాడు. బాబు ఎంతకి బరితెగించాడంటే, అధికారంలోకి రాకముందే, అంటే 2024 ఏప్రిల్‌ నుంచే పింఛన్లు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అంటే జూలైలోనే అర్హులందరికీ నాలుగు వేల రూపాయల పెన్షన్‌ ఇస్తానని చెబుతున్నారు. అంటే ఏప్రిల్‌లో వెయ్యి, మే నెలలో వెయ్యి, జూన్‌లో వెయ్యి, జూలై నాటికి మొత్తం నాలుగేసి వేల రూపాయలు పంచుతానని ఊరిస్తున్నాడు. అంటే టోటల్‌గా ఏడు వేల రూపాయలు పంపిణీ చేస్తానని, అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాడు.

ఎందుకు ఈ వేషాలన్నీ..? వలంటీర్ల ద్వారా వృద్ధులకూ, వికలాంగులకూ, ఒంటరి స్త్రీలకూ పింఛన్లు ఇవ్వడానికి వీల్లేదని నిమ్మగడ్డ రమేష్‌తో తానే ఎలక్షన్‌ కమిషన్‌కి ఫిర్యాదు చేయించి, పేదలకు పింఛన్లు వేళకి అందకుండా అడ్డుపడ్డాడు. పింఛన్ల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ ఎండల్లో తిరిగిన నిరుపేద వృద్ధులు ఏకంగా 39 మంది అన్యాయంగా చనిపోయారు. వాళ్ల మరణాలకు చంద్రబాబే కారణం అని అందరికీ స్పష్టంగా తెలిసింది గనక, చంద్రబాబు ప్లేటు ఫిరాయించి, ‘‘నేనే ఎక్కువ ఇస్తా’’నంటూ ఎచ్చులుపోతున్నాడు. ఈ పిల్లిమొగ్గల వెనక, బాబుని వెంటాడుతున్నది ఓటమి భయం. పవన్‌ కళ్యాణ్‌తో జట్టు కడితే, గాజుబ‌గ్లాసు పగిలి బాబు చేతులు చీరుకుపోయాయి. పురందేశ్వరితో కలిసి కుట్ర చేస్తే బాబు చెవిలో పువ్వులు వెలిశాయి.

‘పొత్తు పొడిచింది’ అని గొప్పలు చెప్పుకుంటే అది విపత్తుగా పరిణమించింది. దాంతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు. చేతగాని లోకేష్ వైపు పిచ్చిచూపులు చూస్తున్నాడు. జనంలో స్పందన కరువై జ్వరం వచ్చినవాడిలాగా నీరసపడిపోయాడు బాబు. పవన్‌ కళ్యాణ్‌ మంచానపడి, రెస్ట్‌లో ఉన్నాడు. దిక్కుతోచని బాబు ‘అన్‌రెస్ట్‌’తో సతమతం అవుతున్నాడు. జగన్‌ ఒక్కడే, ఒక్క జగన్‌ మాత్రమే దీక్షతో, ధైర్యంగా ముందుకు దూసుకుపోతున్నాడు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...