టీడీపీ అధినేత చంద్రబాబుకి మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య. అధికారం కోసం ఏదైనా చేసేస్తానని చెప్పడం.. అధికారంలోకి వచ్చిన తర్వాత దాని ఊసు కూడా ఎత్తకుండా మభ్యపెట్టడంలో ఆయన తర్వాతే ఎవరైనా. ముఖ్యంగా కాపులను ఆయన ఎన్ని సార్లు మోసం చేశారో కూడా లెక్కలేదు. వారికి రిజర్వేషన్లు కల్పిస్తామంటూ ఆశలు చూపించి తర్వాత తెలివిగా బురిడీ కొట్టించారు. ఎన్నికలు వస్తే చాలు ఆయనకు కాపులు గుర్తుకొస్తారు.. వారితో అవసరం తీరిన తర్వాత.. మళ్లీ వారి ఊసే ఎత్తరు.
2014 ఎన్నికల సమయంలో కాపులకు విద్య, ఉద్యోగాల్లో 5 శాతం రిజర్వేషన్లు కల్పిస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మరిచారు.. కాపు నేత ముద్రగడ పద్మనాభం నాయకత్వంలో కాపులు ఆందోళనకు దిగడంతో ఆయనలో కదలిక వచ్చింది. అప్పుడు వారిని బుజ్జగించడానికి చంద్రబాబు మళ్లీ ఇంకో ప్లాన్ వేశాడు. కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ శాసనసభలో బిల్లు పాస్ చేయించుకున్నారు. దాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని కోరుతూ కేంద్రానికి పంపించారు.
కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో రాష్ట్రంలోని మొత్తం రిజర్వేషన్ల శాతం 55కు చేరుకుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదు. అందుకే కాపు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాలని చంద్రబాబు కేంద్రాన్ని అభ్యర్థించారు. అయితే.. దానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించదని చంద్రబాబుకి తెలుసు. కానీ.. వీళ్లను మభ్యపెట్టడానికి తాను నిజంగా ప్రయత్నాలు చేస్తున్నాను అని నమ్మించడానికి తూతూ మంత్రంగా ఆ పని చేశారు.
ఆయన అనుకున్నట్లుగానే.. కేంద్రం అంగీకరించలేదు. కాపు రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేరిస్తే అంతటితో ఆగదని కేంద్రానికి తెలుసు. ఆ డిమాండ్లు ఇతర రాష్ట్రాల నుంచి కుప్పలు తెప్పలుగా వచ్చే అవకాశం ఉంది. అందుకే కాపు రిజర్వేషన్లపై కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. ఇలా పని అయ్యేలా లేదని.. ఈసారి చంద్రబాబు మరో ప్లాన్ వేశారు.
కేంద్రం ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించింది. అందులో 5 శాతం కాపులకు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ఎన్నికలకు ముందు 2019లో చెప్పారు. అయితే, అవి కుల ప్రాతిపదికపై ఏర్పాటు చేసిన రిజర్వేషన్లు కావు. దాంతో కాపులకు చంద్రబాబు ఈడబ్ల్యుఎస్ కోటాలో కేటాయించిన రిజర్వేషన్లు చెల్లుబాటు కాలేదు. కాపులను బీసీల్లో చేరుస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. కానీ.. బీసీ నేతలు ఎదురుతిరగడంతో ఆ వాగ్దానం కూడా గాల్లో కలిసిపోయింది.
అయితే.. కాపులకు రిజర్వేషన్ల విషయంలో మాత్రం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా నిజాయితీగా వ్యవహరించారు. ముందు నుంచి వారిని ఓట్ల కోసం మభ్యపెట్టకుండా… నిజాలే చెబుతూ వచ్చారు. ఈడబ్ల్యుఎస్ కోటాలో కాపులకు రిజర్వేషన్లు ఇవ్వడం కుదరదని అన్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ కాపులకు రిజర్వేషన్లు కల్పించడమనేది తన చేతుల్లో లేదని, అందువల్ల తాను కాపులకు రిజర్వేషన్లు ఇస్తానని హామీ ఇవ్వలేనని చెప్పారు. ఎన్నికలకు ముందు ఆ విధమైన ప్రకటన చేయడం జగన్ ధైర్యమే. అయినప్పటికీ వైఎస్ జగన్ ఎన్నికల్లో గెలిచారు.
తాను అధికారంలోకి వచ్చే తర్వాత మరో విధంగా కాపులను ఆదుకోవడానికి జగన్ ప్రయత్నించారు. కాపు నేస్తం పథకాన్ని అమలులోకి తెచ్చారు. కాపులకు చంద్రబాబు కేటాయించిన నిధుల కన్నా ఎక్కువ నిధులు కేటాయించారు. కాపు కార్పోరేషన్‌ను ఏర్పాటు చేశారు. అయితే.. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వస్తుండటంతో.. చంద్రబాబు కన్ను మళ్లీ కాపుల మీద పడింది. ఆ కాపు నాయకుల ఓట్ల కోసమే పవన్‌ని వెంట పెట్టుకున్నాడు. ఇక ఆ పవన్ కూడా.. తమకు అనుకూలంగా ఉన్న కాపు ఓట్లతో బాబుని గెలిపించడానికి తిప్పలు పడుతున్నాడు.