YouTube channel subscription banner header

ముస్లిం మైనారిటీలకు చంద్రబాబు వెన్నుపోటు

Published on

కొండ మీది కోతిని పట్టుకొస్తానని, ఏవేవో చేస్తానని మైనారిటీలకు హామీలు ఇచ్చి టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చారు. అధికారం రాగానే మొండిచేయి చూపించారు. ముస్లిం మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా ఆయన అమలు చేయలేదు. హజ్‌ యాత్రికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, రేణిగుంటల్లో హజ్‌ హౌస్‌లు కట్టి ఇస్తానని ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. ముస్లిం జనాభా ప్రాతిపదికగా దామాషా ప్రకారం బడ్జెట్‌లో నిధులూ స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్లూ కేటాయిస్తానని ఆయన హామీ ఇచ్చారు. దాన్ని కూడా ఆయన అటకెక్కించారు.

పక్కాగా రికార్డులను తయారు చేసి వక్ఫ్‌ ఆస్తులను రక్షిస్తానని ఆయన చెప్పి మరిచిపోయారు. నిరుద్యోగ ముస్లిం యువత స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు, వ్యాపారం కోసం లక్ష రూపాయలు ఇస్తానని చెప్పి అరకొరగా ఇచ్చేసి చేతులు దులిపేసుకున్నారు. వడ్డీ లేని ఇస్లామిక్‌ బ్యాంకింగ్‌ విధానాన్ని రాష్ట్రంలో అమలు చేస్తానని ఇచ్చిన హామీని కూడా పట్టించుకోలేదు. చంద్రబాబు ఇచ్చిన హామీల జాబితాను ఏకరువు పెడితే చాంతాడంత అవుతుంది. వాటిలో ఎన్ని అమలు చేశారంటే గుడ్లు తేలేయాల్సిందే.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత మైనారిటీలకు జీవనోపాధి చూపించడానికి వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాలను అందిస్తోంది. ఈ ఐదేళ్ల కాలంలో చేయూత ద్వారా 2,24,334 మంది మైనారిటీలకు రూ.1,613.25 కోట్లు, ఆసరా పథకం ద్వారా 1,69,412 మందికి రూ.583.01 కోట్లు అందించింది.

2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 36.18 లక్షల మంది ముస్లింలున్నారు. వారిలో ఎక్కువ మంది చిరు వ్యాపారులు, చేతివృత్తులవారు. వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. నవరత్నాలతో పాటు వివిధ కార్యక్రమాల ద్వారా వారి జీవనోపాధికి ఊతం ఇస్తోంది. వైఎస్సార్‌ సున్నా వడ్డీ, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, జగనన్న చేదోడు, వైఎస్సార్‌ వాహన మిత్ర వంటి పలు పథకాలను అమలు చేస్తోంది.

ఐదేళ్ల కాలంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇమామ్‌లకు, మౌజమ్‌లకు గౌరవ వేతనంగా రూ.300.68 కోట్లు అందించింది. దానికితోడు వన్‌ టైమ్‌ ఆర్థిక సాయం కూడా చేసింది. తెల్లకార్డుల మీద స్పెషల్‌ కోవిడ్‌ అసిస్టెన్సీగా మైనారిటీలకు రూ.100 కోట్లు ఇచ్చింది. షాదీతోఫా వంటి పథకాల ద్వారా ఆర్థిక సాయం చేసింది.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మైనారిటీల ఆర్థిక సహాయ సంస్థ ద్వారా మైనారిటీల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి, శిక్షణకు, విద్యాభివృద్ధికి బ్యాంకుల ద్వారా సబ్సిడీ రుణాలు ఇప్పించడం ఆనవాయితీ. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో బ్యాంకుల ద్వారా రుణాలకు రూ.343.52 కోట్లు కేటాయించి, రూ.248.51 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. మైనారిటీల శిక్షణ, ఉపాధి పథకంలో ఆ ఐదేళ్ల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం రూ.62 కోట్లు కేటాయించి, రూ.53.89 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. హామీలు ఇచ్చి వాటి చెత్తబుట్ట దాఖలా చేయడం చంద్రబాబు ప్రభుత్వం చేసిన పని. అందుకు విరుద్ధంగా వైఎస్‌ జగన్‌ ముస్లిం మైనారిటీలకు అండగా నిలుస్తున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...