YouTube channel subscription banner header

బీసీలు, మైనార్టీలకు బాబు వెన్నుపోటు

Published on

టీడీపీకి బీసీలే వెన్నెముక అంటూ తరచూ డబ్బా కట్టుకునే చంద్రబాబు.. సీట్ల కేటాయింపులో మాత్రం బీసీలతో పాటు మైనారిటీలకు వెన్నుపోటు పొడిచారు. తన సామాజిక వర్గానికే అధిక ప్రాధాన్యతనిస్తూ 94 సీట్లలో ఏకంగా 21 సీట్లు కమ్మలకే కేటాయించారు. మైనారిటీలకు కేవలం ఒకే ఒక్క సీటు ఇచ్చారు. బీసీలకు 18, ఎస్సీలు 20, కాపులకు కేవలం 7 సీట్లే ఇచ్చారు. చంద్రబాబు వ్యవహారశైలిపై ఇతర వర్గాలు మండిపడుతున్నాయి. మరోవైపు, చంద్రబాబు తీరుపై టీడీపీ యువ నేతలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో యువతకు 40 శాతం సీట్లు ఇస్తామని, యువ రక్తంతో పార్టీని నింపేస్తామంటూ చంద్రబాబు, లోకేష్ వేసిన క్యాసెట్టే మళ్లీ మళ్లీ వేశారు. కానీ సీట్ల కేటాయింపులో వాళ్లను పూర్తిగా పక్కన పెట్టేశారు. దీంతో యువతకు 40 శాతం సీట్లు ఎక్కడ బాబూ అంటూ ఆ పార్టీ యువ నాయకులు ప్రశ్నిస్తున్నారు.

ఇక 2014–19 మధ్య టీడీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ బలహీన వర్గాలకు చంద్రబాబు ఇలానే వెన్నుపోటు పొడిచారు. ఒక్కరంటే ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదు. అగ్రవర్ణాలు.. అందులోనూ తన సామాజిక వర్గం వారినే అధికంగా రాజ్యసభకు పంపారు. న్యాయం చేయాలని విన్నవించుకున్న నాయీ బ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తానన్నారు. హామీని నెరవేర్చాలని కోరిన పాపానికి తాట తీస్తానంటూ మత్స్యకారులను బెదిరించారు. ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా? అని వ్యాఖ్యానించి దళితులను దారుణంగా అవమానించారు. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారంటూ బాబు అవహేళన చేసిన వైనాన్ని ఆయా వర్గాలకు చెందిన వారు గుర్తు చేసుకుంటున్నారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...