టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబుకి ఏపీలోని వలంటీర్ వ్యవస్థ పట్ల ఎనలేని భయం పట్టుకుంది. ఎలాగైనా ఎన్నికలలో గెలవాలి అన్న ఉద్దేశంతో చంద్రబాబు చేసిన ఓ పని కారణంగా ఆయనే విజయానికి దూరం కావాల్సి వస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. వలంటీర్ల ద్వారా ప్రజలకు నేరుగా సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. దీంతో వారినే ఆయన లక్ష్యంగా చేసుకున్నారు. చివరకు మాజీ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ద్వారా దాన్ని సాధించానని ఆయన అనుకోవచ్చు.
ఎన్నికలు ముగిసే వరకు వలంటీర్లు విధులకు హాజరు కాకూడదని, వారి వద్ద ఉన్న ట్యాబ్ , సిమ్ కార్డులను కూడా అధికారులకు అందజేయాలంటూ ఉత్తర్వులు జారీ చేయించారు. అయితే ఈ విషయమే చంద్రబాబు మెడకు చుట్టుకుందని తెలుస్తోంది. ఈ విషయంపై నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిర్యాదు చేయడంతో ఎన్నికల కమిషన్ ఆంక్షలు విధించింది. దీంతో వలంటీర్లు తమ విధులకు దూరమయ్యారు. ఈ క్రమంలోనే ప్రతినెలా ఒకటో తారీకు అందే పెన్షన్ విషయంలో వృద్ధులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వలంటీర్ సేవలను ప్రజలకు దూరం చేసి జగన్‌పై వ్యతిరేక ప్రభావాన్ని చూపించేలా చంద్రబాబు ప్లాన్ చేశారు.
ఈ ప్లాన్ తనకే బెడిసి కొట్టిందని తెలుస్తోంది ఇలా వలంటీర్లు తమ విధులకు దూరం అవ్వడమే కాకుండా చంద్రబాబు అధికారంలోకి వస్తే తమకు ఈ వలంటీర్ ఉద్యోగం కూడా ఉండదని భావించివాళ్లు కూడా వైసీపీ జెండా పట్టుకొని ఇంటింటికి ప్రచారానికి వెళ్తున్నారు. ఇలా ప్రచారంలో భాగంగా తమ సేవల గురించి ప్రశ్నలు ఎదురవడంతో దీనంతటికీ కారణం ఏంటి అనే విషయాలను స్పష్టంగా వివరిస్తున్నారు.
ఇలా చంద్రబాబు కారుణంగానే వలంటీర్లు తమ విధులకు దూరమయ్యారని ప్రజలకు అందాల్సిన సంక్షేమం అందకుండా పోతుందని ప్రజలు గ్రహిస్తున్నారు. ఇక పెన్షన్ తీసుకోవాలంటే వృద్ధులు సచివాలయం వరకు వెళ్లాలి అంటే ఎంతో కష్టతరం. ఇలా చంద్రబాబు తన అతి తెలివితేటలను ప్రదర్శించి జగన్ పై దుష్ప్రచారం చేయించాలని చూసినా, అది ఆయనకే ప్రమాదకరంగా మారింది. వలంటీర్ విధులకు దూరం కావడంతో చంద్రబాబు పట్ల ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. ఈ వ్యతిరేకత ఆయనను విజయానికి కూడా దూరం చేస్తుందని స్పష్టంగా తెలుస్తోంది.