YouTube channel subscription banner header

తాటతీసేవాడ్ని.. చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు

Published on

ఒక నేరస్థుడిని ఎదుర్కోడానికి రాజకీయం చేయడం తనకు నామోషీగా ఉందని, కానీ ప్రజా హితం కోసం తప్పడం లేదని అన్నారు సీఎం చంద్రబాబు. రాజకీయ పార్టీ ఆఫీస్ అంటే నాయకులకు దేవాలయం లాంటిదని, అలాంటి పార్టీ ఆఫీస్ పై దాడి చేసే విష సంస్కృతి వైసీపీది అని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పార్టీ ఆఫీస్ లపై దాడులు చూడలేదని, కానీ జగన్ అధికారంలోకి వచ్చాక దాడులు చేశారని పైగా వాటిని కప్పిపుచ్చుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారని, దాడి చేసిన వారిని అరెస్ట్ చేస్తే నిరసనలు తెలియజేస్తున్నారని అన్నారు. నేరస్థులు రాజకీయాల్లోకి వస్తే ఇలాగే ఉంటుందని, నేరగాళ్లు ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నారని, వారికి రాజకీయ ముసుగు లేకపోతే, 2 నిమిషాల్లో వారిని పట్టుకొచ్చి తాటతీసి, ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేవాడినని అన్నారు చంద్రబాబు. కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై సమీక్ష కార్యక్రమంలో వైసీపీ, జగన్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారాయన.

https://x.com/JaiTDP/status/1833790778969116681

సాక్షి పేపర్ తమపై విషం చిమ్ముతోందన్నారు సీఎం చంద్రబాబు. తమను ఓడించారనే కోపంతో ప్రజలపై ద్వేషం పెంచుకుని ఏదో ఒక విధంగా నష్టం చేయాలని వారు అనుకుంటున్నారని చెప్పారు. అసలు వైసీపీ రాష్ట్రంలో ఉండటమే దురదృష్టం అని, భారత దేశ చరిత్రలో ఎక్కడా ఇలాంటి పార్టీ లేదని అన్నారు. తన హయాంలో రౌడీలెవరూ రోడ్లపైకి వచ్చేవారు కాదని, అంతకు ముందు గల్లీకో రౌడీ ఉండేవారని, తన పాలనలో రౌడీలే లేకుండా చేశానన్నారు చంద్రబాబు. రాయలసీమలో ముఠా రాజకీయాలు లేకుండా చేశానని చెప్పారు. బాంబులతో దాడి చేసినా, ప్రజలకు న్యాయం చేయాలని ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకెళ్లానన్నారు. విజయవాడ వరదల్లో కొన్నిచోట్ల కనీసం మంచినీరు, తిండి కూడా ఇవ్వలేకపోయామని, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా కొన్నిచోట్ల బోట్లు వేసుకుని వెళ్లలేకపోయారని చెప్పారు. అందుకే హెలికాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం సరఫరా చేశామన్నారు. ప్రజలకోసం తాము అవస్థలు పడుతుంటే.. తమపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు చంద్రబాబు.

https://x.com/JaiTDP/status/1833791801771131299

వైసీపీ మొత్తం దోచేసిందని, ఏపీకి అప్పులు మిగిల్చిందని, వాటిని భర్తీ చేస్తున్నామని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఖాళీ ఖజానాతో అభివృద్ధి ఆగిపోయిందని, ప్రభుత్వం వద్ద డబ్బుల్లేకపోయినా నెట్టుకొస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ తప్పిదాలతో విజయవాడకు వరదలొచ్చాయని, బుడమేరుకు గండ్లు పడ్డాయని చెప్పారాయన. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ భ్రష్టుపట్టాయని, పనిచేసే వ్యక్తులు పనిచేయడం మానేశారన్నారు. వరదల తర్వాత సాధారణ పరిస్థితులు రావడానికి 10 రోజులు టైమ్ పట్టిందన్నారు. బుడమేరు గండ్లు పూడ్చటానికి ఒక యుద్ధమే చేశామన్నారు చంద్రబాబు.

https://x.com/JaiTDP/status/1833779727934382531

ప్రకాశం బ్యారేజీ కొట్టుకుపోతే లంక గ్రామాలు ఏమైపోతాయని ప్రశ్నించారు చంద్రబాబు. అప్పుడు బాబాయిని చంపి నెపం తనపై నెట్టారని, ఇప్పుడు బోట్లతో విధ్వంసం సృష్టించాలని కుట్ర పన్నారని విమర్శించారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...