YouTube channel subscription banner header

బీసీల ద్రోహి చంద్రబాబు.. బీసీలకు కుచ్చుటోపి పెట్టారుగా..?

Published on

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల త్వరలోనే జరగబోతున్నటువంటి నేపథ్యంలో అభ్యర్థుల జాబితాలను విడుదల చేస్తూ అన్ని పార్టీ నేతలు ప్రచార కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నాలుగవ విడత అభ్యర్థుల జాబితాను కూడా విడుదల చేశారు. అయితే ఈ ఎన్నికలలో చంద్రబాబు నాయుడు బీసీలకు తీవ్రస్థాయిలో అన్యాయం చేశారు.

బీసీలపై తనకు ప్రేమ ఉందని బీసీలకు తానే మేలు చేశానని ఇకపై బీసీలకు మేలు చేసేది కూడా తానే అని చెబుతూనే మరోవైపు సీట్లు కేటాయింపు విషయంలో బీసీలకు తీవ్రమైన అన్యాయం చేశారు. పొత్తులో భాగంగా టీడీపీకి 17 ఎంపీ స్థానాలను కేటాయించారు. ఇందులో కేవలం 6 సీట్లు మాత్రమే బీసీలకు ఇచ్చారు.

అదే జగన్మోహన్ రెడ్డి ఏకంగా 20 అన్‌ రిజర్వ్‌డ్‌ సీట్లలో 11 బీసీలకు కేటాయించారు. బీసీ జనాభా అధికంగా ఉన్న నియోజకవర్గాలను చంద్రబాబు తన సొంత వర్గానికి కేటాయించారు. తాజాగా 4 లోక్‌సభ స్థానాలను చంద్రబాబు ప్రకటించారు. ఈ మొత్తంలో బీసీలకు తీవ్రమైన అన్యాయం చేసింది చంద్రబాబు. టీడీపీకి దక్కిన 17 స్థానాల్లో కాపు సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం బీసీలకు పెద్దపీట వేశారు. 175 అసెంబ్లీ 25 లోక్ సభ స్థానాలలో సుమారు 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కేటాయించారు. ముఖ్యంగా బీసీలకు మహిళలకు ఆయన పెద్దపీట వేశారు. 175 స్థానాలలో జగన్మోహన్ రెడ్డి 48 మంది బీసీలకు టికెట్లు ఇచ్చారు. అలాగే 11 లోక్ సభ సీట్లు కేటాయించి బీసీల పట్ల తనకున్నటువంటి ప్రేమను చాటుకోగా చంద్రబాబు నాయుడు మాత్రం బీసీలకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారని చెప్పాలి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...