టిప్పర్ డ్రైవర్‌కు టికెట్ ఇస్తే వేలిముద్రలు వేయించుకోవచ్చని జగన్మోహన్ రెడ్డి పెద్ద ప్లాన్ వేశాడు.. నువ్వు చాలా గొప్పోడయ్యా జగన్ అంటూ చంద్రబాబు హేళనగా మాట్లాడారు. ఇలాంటి ఐడియాలు జగన్మోహన్ రెడ్డికే వస్తాయి శభాష్ అంటూ తానేదో గొప్పగా మాట్లాడానని భావించారు. కానీ, చంద్రబాబుకు తెలియని విషయం ఏమిటంటే టిప్పర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న వీరాంజనేయులు ఏకంగా పీజీ కూడా పూర్తి చేశారు