జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుగా ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ఆయన వ్యవహారశైలి అదే రీతిలో ఉంది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనను కేంద్రం ముందుకు తెచ్చినప్పుడు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను నిందించారు. బీజేపీతో అంటకాగుతూ కేంద్రాన్ని మాత్రం ఒక్క మాట కూడా అనలేకపోయారు