YouTube channel subscription banner header

షర్మిలపై జగన్ వ్యాఖ్యలు.. చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన

Published on

టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి విషయాలు ఎలా అర్థమవుతాయో తెలియదు. ఆయన లేనివాటిని ఉన్నట్లు ఉన్నవాటిని లేనట్లు చూస్తారు, వ్యాఖ్యానిస్తారు. పులివెందులలో వైఎస్ జగన్ షర్మిలపై చేసిన వ్యాఖ్యలపై ఆయన దుర్మార్గమైన ఆలోచనతో కూడిన వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏ అర్థంలో షర్మిలపై వ్యాఖ్యలు చేశారో అర్థం కానంత మందబుద్ధి చంద్రబాబుకు ఉందని అనుకోవడం లేదు. కానీ జగన్ మీద చేసిన వ్యాఖ్యలు వక్రబుద్ధితో చేసినట్లున్నాయి.

వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను కూలుస్తామన్నవాళ్లతో తన చెల్లెమ్మలు చేతులు కలిపారని, పసుపు చీరలు కట్టుకుని వస్తున్నారని చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘తోడబుట్టిన చెల్లెలి పుట్టుకుపైనా.. మహాలక్ష్మిగా భావించే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైనా విమర్శలు చేసేవాడు ఒక ముఖ్యమంత్రా? ఎంత నీచం! ఇది కాదా వికృత మనస్తత్వం?’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించాడు.

జగన్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు అర్థం చేసుకున్న భాషలో ఉన్నాయా అని ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. వారసత్వాన్ని ప్రశ్నిస్తే పుట్టుకపై వ్యాఖ్యలు చేసినట్లుగా చంద్రబాబుకు అర్థమైంది. పసుపు చీర కట్టుకున్నారని అంటే ఇంటి ఆడబిడ్డ కట్టుకున్న చీరపైన కామెంట్ చేసినట్లుగా ఆయనకు అర్థమైంది. పసుపు చీర కట్టుకుని వచ్చారంటే టీడీపీ మద్దతుతో వచ్చారని అర్థం చేసుకోవాలనే ఇంగితం కూడా చంద్రబాబుకు లేకుండా పోయింది. ఆయన వ్యాఖ్యల్లో బూతు కూడా అంతర్లీనమై ఉంది. చంద్రబాబు దుర్మార్గం ఆలోచన ఆ రూపంలో బయటపడింది.

సమాధానం కూడా ఇవ్వలేని స్థితిలో చంద్రబాబు జగన్‌కు కౌంటర్ ఇచ్చారని రాధాకృష్ణ మీడియా కలర్ ఇచ్చింది. ‘ఎంత నీచం’ అంటూ జగన్‌కు చంద్రబాబు దిమ్మదిరిగే కౌంటర్ అంటూ శీర్షిక పెట్టింది. అంతేకాదు, షర్మిల చంద్రబాబును కలిసినప్పుడు పసుపు చీర ధరించారు. ఆ ఫొటోను కూడా ప్రచురించింది. నిజానికి, చంద్రబాబును కలిసినప్పుడు షర్మిల ఏ చీర కట్టుకున్నారనే విషయం అందరూ మరిచిపోయి ఉంటారు. అంత ప్రత్యేకంగా చూసేవారు కూడా ఉండరు. కానీ రాధాకృష్ణకు మాత్రం గుర్తొచ్చింది. ఏమైనా చంద్రబాబుకు వంత పాడే రాధాకృష్ణ అంతకన్నా ఏం చేస్తారు? దుర్మార్గం ఆలోచనలో ఆయన చంద్రబాబును మించిపోయారని అందరికీ తెలుసు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...