YouTube channel subscription banner header

చంద్రబాబు టార్గెట్ వేరే.. ఆ దిశగానే అడుగులు

Published on

పాలనలో జగన్ పద్ధతి వేరు, చంద్రబాబు వ్యూహాలు వేరు అని స్పష్టంగా తేడా తెలుస్తోంది. నవరత్నాలపై ఫోకస్ పెట్టిన జగన్, మౌలిక వసతుల కల్పనపై పూర్తి స్థాయిలో దృష్టిపెట్టలేదన్న ఆరోపణలున్నాయి. కానీ పథకాలు ఎన్నికల్లో ఆయన్ను కాపాడలేకపోయాయి. చంద్రబాబు వచ్చాక పథకాల ముచ్చటే లేదు. అమ్మఒడి, రైతు భరోసా, నేతన్న నేస్తం.. ఎప్పుడు అమలు చేస్తారంటూ జగన్ పదే పదే నిలదీస్తున్నా ఫలితం లేదు. కనీసం ఆయా పథకాలపై ప్రభుత్వం స్పందించడం లేదు. అదే సమయంలో చంద్రబాబు తన ప్రాధాన్యాలను మాత్రం పూర్తి చేసేలా ఉన్నారు.

https://x.com/JaiTDP/status/1834620000805826671

చంద్రబాబు టార్గెట్ అమరావతి. రాజధాని విషయంలో గతంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా ఈసారి గ్రాఫిక్స్ లేకుండా పనులు చేయాలనే ప్రయత్నం మొదలైంది. ఆ విషయంలో సక్సెస్ అయితేనే 2029 ఎన్నికల నాటికి ప్రభుత్వంపై ప్రజలు ఓ అంచనాకి వస్తారు. అదే సమయంలో చంద్రబాబు మౌలిక వసతులపై కూడా ఫోకస్ పెంచారు. జగన్ హయాంలో రోడ్ల నిర్వహణ, మరమ్మతులను వదిలేశారనే అపవాదు ఉంది. ముందుగా దానిపై దృష్టిపెట్టారు చంద్రబాబు. తాజాగా రోడ్లు-భవనాల శాఖపై సమీక్ష చేపట్టిన సీఎం.. వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్టు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో రోడ్లపై గుంతలు పూడ్చేందుకు రూ.290 కోట్లు మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే ఈ పనులు ప్రారంభించాలని సీఎం అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణానికి అవసరమయ్యే భూ సేకరణకు కూడా నిధులు విడుదల చేస్తున్నట్టు తెలిపారు చంద్రబాబు.

వర్షాలు, వరదల సమయంలో జగన్ ఉండి ఉంటే ఆయన ప్రాధాన్యత వేరుగా ఉండేది. తక్షణ సాయం, ఆ తర్వాత నష్టపరిహారంపై ఆయన దృష్టిపెట్టేవారని, కానీ కొత్త ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. వారి ఆరోపణలకు తగ్గట్టుగానే నష్టపరిహారం కంటే ముందు రోడ్లు మరమ్మతులు చేయాలనుకుంటున్నారు చంద్రబాబు. వరదల తర్వాత రోజుల వ్యవధిలోనే రోడ్లు మెరిసిపోతున్నాయంటూ టీడీపీ అనుకూల మీడియాలో వార్తలు కూడా వచ్చేస్తాయనడంలో సందేహం లేదు. ఇక్కడ ప్రజలకు ఏది మేలు అనేదానికంటే, ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం ఆశిస్తున్నారనేదే ముఖ్యం. పథకాల అమలే ముఖ్యం అని జగన్ అనుకున్నారు. ఎన్ని అడ్డంకులొచ్చినా, వాటికి నిధుల కొరత లేకుండా చూసుకున్నారు. చంద్రబాబు పథకాల అమలుకంటే మౌలిక వసతులపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. తన ప్రాథామ్యాలపై ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు పంపించారు.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...