YouTube channel subscription banner header

వలంటీర్ వ్యవస్థ.. ఊపిరాడని చంద్రబాబు

Published on

వలంటీర్ వ్యవస్థపై ఆడిన నాటకాలకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో ఉపయోగపడుతారనే భయంతో చంద్రబాబు కుట్రలు చేశారు. వారిని విధులకు దూరంగా ఉంచాలని తన మ‌నిషి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌తో ఈసీకి ఫిర్యాదు చేయించారు. వారిని విధులకు దూరంగా ఉంచాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో పింఛన్లు అందక ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. అది చంద్రబాబుకు ఎదురు తిరిగింది. చంద్రబాబు వల్లనే తమకు ఈ దురవస్థ వచ్చిందని ప్రజలు విమర్శిస్తూ వచ్చారు.

దానికితోడు, వలంటీర్లు తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేస్తూ వస్తున్నారు. రాజీనామాలు చేసిన తర్వాత వారు వైసీపీకి పూర్తి స్థాయిలో పనిచేస్తారనే ఆందోళనతో చంద్రబాబు మరో కుట్రకు తెర తీశారు. అందులో భాగంగానే రాజీనామాలు చేయకుండా వలంటీర్లను నిలువరించాలని, వారి రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ కోర్టుకు ఎక్కారని అంటున్నారు.

ఇప్పటి వరకు 62 వేల మంది గ్రామ, వార్డు వలంటీర్లు రాజీనామా చేశారని, ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడంతో 900 మందిని విధుల నుంచి తొలగించామని ఈసీ కోర్టుకు తెలిపింది. ఎన్నికల పనులకు వారిని దూరంగా పెట్టామని కూడా చెప్పింది. ఇంతవరకు బాగానే ఉంది. కానీ, వలంటీర్లు రాజీనామాలు చేసి తమకు ఇష్టమైన పార్టీకి పని చేసుకోవడాన్ని ఆపలేమని కోర్టు స్పష్టం చేసింది.

వలంటీర్లు రెగ్యులర్ ప్రభుత్వ ఉద్యోగులు కాని, కాంట్రాక్టు ప్రాతిపదికపై వారు పనిచేస్తున్నారని, రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం కోసం పనిచేయాల్సిన అవసరం వారికి లేదని ఈసీ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. వలంటీర్లు ఫలానా పని మాత్రమే చేయాలని రాజీనామాలు చేసిన తర్వాత ఈసీ ఆదేశించలేదని, రాజీనామాలు చేసిన తర్వాత వారు ఏ రాజకీయ పార్టీ కోసమైనా లేదా సంఘం కోసమైనా పని చేసుకోవచ్చునని ఆయన చెప్పారు. రాజీనామాలు చేసిన తర్వాత ఫలానా పని మాత్రమే చేయాలని తాము ఎలా ఆదేశిస్తామని కోర్టు ప్రశ్నించింది.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...