YouTube channel subscription banner header

విజనా ?? విస్తరాకు కట్టా? బాబు చెప్పేవన్నీ డాంబికాలే.. జావగారిన ‘జాతి’రత్నాల సేవ

Published on

ప్రచార యావ తప్ప, పనుల్లో పసలేని పచ్చ నాయకుడు చంద్రబాబు. ఇంక ఆయన పచ్చ మీడియా బ్యాచ్ అయితే నిద్దర్లేచిందగ్గర్నుంచి, పడుకునేవరకూ.. ఓహ్ మని ఊదరగొట్టి మామూళోళ్ళకి పగలు చూడలేకుండానే రాత్రి కలలోకి వచ్చేటట్టు కొట్టేస్తుంటారు డబ్బా.

సంపద సృష్టించే వాణ్ని నేనే. విజనరీ ని నేనే.. అనే బాబు సొంతడబ్బా ఎంత దూరం పోయిందంటే, అసలు సూర్యుడికి ఉదయించమని నేనే చెప్పా.. అమావాస్య నాడు బయట తిరగకు బాసూ అని చంద్రుడికి కూడా నేనే ఆర్డరేసా అన్నట్టు చేసుకునే ప్రచారం చూస్తే బుర్ర ఉన్న వాళ్లెవరికైనా ఒళ్ళు మండుతూ ఉంటుంది.

ఖచ్చితంగా ఇన్ సైడర్ ట్రేడింగ్‌కి పాల్పడి తనవాళ్లందరితోనూ భూములు కొనిపించి పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పంచారామాల్లో ప్రసిద్ధమైన అమరావతి పేరుని ఊరులేని ప్రాంతానికి పేరుగా ఎంచుకుని రాజధాని ప్రాతం అని ప్రకటించేసి కోట్ల వ్యాపారాలకు తెరతీసిన మాయావి చంద్రబాబు.
అసలు ఎవరి ఆమోదంతో ఈయన ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నాడో, ఎవరికీ అంతుపట్టదు. పెట్టిన పేరులోనూ క్రియేటివిటీ అస్సలు లేదు. ఎవరి ప్రయోజనాల కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడో లోకమంతా తెలిసేటట్టు చేసి ముఖ్యమంత్రి జగన్ చంద్రబాబు దురుద్దేశాన్ని బట్టబయలు చేశారు.
బాబుతో అంటకాగిన అప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. బహుశా చంద్రబాబు జైల్లో ఉన్న కాలంలోనే ఈయన కూడా క‌ట‌క‌టాల‌ పాలయినట్టున్నాడు. తోడు దొంగలిద్దరూ రకరకాల కేసుల్లో 2023 పుణ్య సంవత్సరంలో ఊచలు లెక్కబెట్టారు. విధి బలీయమైనది బాబు గారికి అప్పుడు తెలిసినట్టుంది.

మాటిమాటికీ జగన్ ని బెయిల్ మీద ఉన్న ముఖ్యమంత్రి అనే చంద్రబాబుకి తనే వెనక ఉండి వేయించిన తప్పుడు కేసుల విషయం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు రింగురింగులుగా కళ్ళ ముందు తిరిగి ఉండాలి. దెబ్బకి మళ్ళీ ఆ మాట మాట్లాడటం మానేశాడు.

హస్తినాపురం కట్టిన విశ్వకర్మ లెవెల్లో పోజులు కొడదామనుకున్న చంద్రబాబు ఆయన సృష్టించేద్దామనుకున్న మాయానగరంలో రియల్ ఎస్టేట్ ధరలు ఆకాశానికి అంటేటట్టు పెంచేలా చేసి అస్మదీయులు అమ్ముకోడానికి ఏర్పాట్లు చేసి.. ఇంకా విజన్ విజన్ అనుకుంటూ.. అంతర్జాతీయ కంపెనీలని తెచ్చి కోట్లాది రూపాయలు దోచిపెట్టి DPR (కేవలం డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) మాత్రమే తయారు చేయించాలని అడ్వాన్స్ లు కూడా కట్టేశాడు. తన జేబు సొమ్ము కాదు కదా. మనది కాకపొతే కాశీ దాకా డేకమన్న సామెత గుర్తొచ్చినట్టుంది.. తన పిచ్చి ప్రయత్నానికి ఆ ‘కాశీ’ ఎంపీ, దేశ ప్రధాన మంత్రి నరేంద్రమోడీని తీసుకొచ్చి ఒక రాయి వేయించాడు.

వెంటనే పిచ్చి ప్రేలాపనలు మొదలు పెట్టేశాడు. అమరావతికి హైపర్ లూప్ (అతి వేగంగా వెళ్లే మాగ్నెటిక్ రైలు) తెస్తా.. 2018లో అమరావతిలో ఒలింపిక్స్ నిర్వహిస్తా.. ఇలా సంధి ప్రేలాపనలు పేలడం.. దాన్ని ఆహా విజనరీ ఓహో విజనరీ అని పిచ్చి పచ్చ బాకాలు మొత్తుకోడం ప్రజలు మర్చిపోలేదు. ఆయనగారి వాగుడు నిజానికి దాచేస్తే దాగని సత్యం. యూట్యూబ్ చానళ్లలో అందరూ సంతోషంగా వీక్షించొచ్చు. ఎద్దు ఈనిందంటే దూడని కట్టేయండి అన్న సామెత టైపు లో పచ్చ బాకాలు ఆహా ఓహో అంటూ ఈయనని ఆకాశానికి ఎత్తెయ్యడం అందరమూ చూశాం.

రకరకాల డిజైన్లు, ఇడ్లీ స్టాన్డ్ ఆకారంలో సెక్రటేరియట్, ఇంకా తొమ్మిది నగరాలు ఇలా ఏవేవో పిచ్చి గ్రాఫిక్స్ చేయించి ప్రపంచమంతా తిప్పి ఆంధ్రప్రదేశ్ ని పదుగురి ముందు ఒక కార్టూన్ లాగా నిలబెట్టాడు. ఈయన బాధ పడలేక నిరర్థకమైన ప్రాజెక్టు చెయ్యలేక ‘మాకి అసోసియేట్స్’ అనే జపాన్ సంస్థ అధ్యక్షుడు ఫుముహికో మాకీ అనే ఆయన నానా తిట్లూ తిడుతూ ఉత్తరం రాసి, కేంద్రప్రభుత్వానికి కంప్లెయింట్ ఇచ్చి మరీ తప్పుకున్నాడు. ఇంత శృంగభంగం జరిగాక లండన్ కంపెనీ ఫాస్టర్ అండ్ పార్ట్నర్ ని తెచ్చి సినిమా దర్శకులని పెట్టి తన ‘జాతీయ’ భద్రతా కోసం కృషి చేద్దామనుకుంటే ఎలక్షన్లలో కొంప కొల్లేరయ్యింది.

గాల్లో ప్రయాణిస్తుంది చెప్పిన హైపర్లూప్ గాల్లో కలిసిపోయింది. ఒళ్ళు తెలియకుండా చేసిన ఒలింపిక్స్ వాగ్దానం తోలు ఒలిచేసింది. ఇడ్లీ స్టాండ్ ఇంగ్లిషు జోకు లా ఇకిలించింది. విజన్ వికటించింది
భజన బావురుమంది. మళ్ళీ 2024 ఎన్నికలు ముంగిట్లోకొచ్చేశాయ్. ఎవరి కోసం ఈ త్రిశంకు నగరం నిర్మిద్దామనుకున్నాడో, ఆ గద్దలన్నీ మళ్ళీ కళేబరాల కోసం ఆకాశం లోనుంచి ఎగురుకుంటూ వాలాయి. కానీ, రాష్ట్రం అన్యాయమైపోకుండా జగన్ కత్తి తీసుకుని కాపలా కాస్తున్నాడు. జనం ఓట్ల పండుగ కోసం ఓపిక గా ఎదురు చూస్తున్నారు. ఈసారి మూకుమ్మడిగా వచ్చిన కూటమి మూకను మూర్ఛపోయేటట్టు ఓట్లతో కొట్టడానికి వారంతా ‘సిద్ధం’.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...