YouTube channel subscription banner header

వైసీపీలో పదవుల భర్తీ..

Published on

ఓటమి తర్వాత పార్టీ నిర్మాణంపై జగన్ దృష్టిసారించినట్టు తెలుస్తోంది. అయితే ఒకేసారి సంచలనాత్మక నిర్ణయాలు తీసుకోడానికి ఆయన ఉత్సాహం చూపించడంలేదు. ఇటీవల పార్టీ ప్రధాన కార్యదర్శుల నియామకం జరిగింది, కొన్ని నియోజకవర్గాలకు సమన్వయకర్తల్ని మార్చారు. తాజాగా కొన్ని జిల్లాలకు అధ్యక్షుల్ని మార్చారు జగన్.

https://x.com/YSRCParty/status/1830993039621341528

అనంతపురం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా అనంత వెంకటరామిరెడ్డి, సత్యసాయి జిల్లా పార్టీ అధ్యక్షురాలిగా మాజీ మంత్రి ఉషాశ్రీ చరణ్, తూర్పు గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, రాజమండ్రి నగర పార్టీ అధ్యక్షులుగా మార్గాని భరత్ ని నియమించినట్టు వైసీపీ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఇక్కడ మీడియా హడావిడిని కూడా జగన్ పరిగణలోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మార్గాని భరత్, ఉషశ్రీచరణ్ కొన్నాళ్లుగా పార్టీ తరపున తమ వాయిస్ గట్టిగా వినిపిస్తున్నారు. ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. వారిద్దరికీ తాజాగా కీలక పదవుల్ని ఇచ్చారు జగన్. ఓటమి తర్వాత ఇంటికి పరిమితం అయిన సీనియర్లను పక్కనపెట్టి, ప్రజల్లోకి వెళ్తూ, కార్యకర్తలకు అండగా ఉంటూ, ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెడుతున్నవారికి జగన్ ప్రాధాన్యత ఇస్తున్నట్టు స్పష్టమవుతోంది. నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి పేరు బలంగా వినిపిస్తున్నా.. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డినే అక్కడ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగించేందుకు పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో సీనియర్ నేతలతో జగన్ సమావేశమయ్యారు. విజయవాడ వరద కష్టాలు, పార్టీ తరపున చేపట్టిన సహాయ కార్యక్రమాలపై వారితో చర్చించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి ప్రస్తావన వచ్చినట్టు టీడీపీ అనుకూల మీడియా ప్రత్యేక వార్తలివ్వడం విశేషం. బాలినేని పార్టీ మారతారన్న వార్తల నేపథ్యంలో ఆయనకు అనుకూలంగా ఒంగోలునుంచి వచ్చిన నేతలు జగన్ తో మాట్లాడారని, బాలినేనిని పిలిపించుకుని మాట్లాడాలని జగన్ కి విన్నవించారనేది టీడీపీ అనుకూల మీడియా కథనాల సారాంశం.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...