నిన్న పిఠాపురంలో పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్ర నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ప్రచారంలో గతానికి భిన్నంగా పవన్ కళ్యాణ్ బేలగా కనిపించడం అభిమానులకు మింగుడు పడటం లేదు. పదేళ్ల నుంచి ఒంటరిగా పోరాటం చేస్తున్నానని.. దయచేసి తనను గెలిపించాలని.. పదే పదే ప్రజలను పవన్ వేడుకొన్నాడు. తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని పవన్ ప్రకటించిన వెంటనే ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన వర్మ ఇంటికి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి ఆయన మద్దతు కోరడం, ప్రచారంలో వర్మను వెంటేసుకుని తిరగడం అభిమానులకు నచ్చడం లేదు.
ఎందుకింత బెగ్గింగ్?.. పదేపదే వర్మతో భేటీ కావడం ఏంటీ? అని ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ను నిలదీస్తున్నారు. పవన్ ఏంటీ..ఇలా ఓట్లు అడుక్కుంటున్నాడని నెటిజన్లు ఆశ్చర్యపోతుండగా.. ప్లీజ్ అలా ఓట్లు అడుకోవద్దని.. ఫ్యాన్స్ పవన్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.
పదేళ్ల నుంచి టీడీపీ కోసం పనిచేస్తున్నావ్.. 2014లో టీడీపీతో పొత్తు, 2019లో టీడీపీ కోసం ఓట్లు చీల్చే ప్రయత్నం, ఇప్పుడు మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకున్నావు.. ఇక నువ్వేం ఒంటరి అంటూ.. ఇతర పార్టీల కార్యకర్తలు పవన్‌పై విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి పదేళ్ల కాలం పూర్తయిన సంగతి తెలిసిందే. అయితే ఇంతవరకు ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టలేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేగా కూడా గెలవలేని నువ్వు తమపై విమర్శలు చేయడం ఏంటని.. గతంలో పలుమార్లు వైసీపీ నాయకులు పవన్‌ను నిలదీశారు. ఇక ఈసారి కూడా ఎమ్మెల్యేగా నెగ్గకపోతే తన రాజకీయ జీవితం ముగుస్తుందని భావిస్తున్న పవన్ కళ్యాణ్ తనని ఎలాగైనా ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజలను పదేపదే వేడుకుంటున్నారు. పవన్ ఓట్లు అడుక్కుంటున్న తీరు మాత్రం అభిమానులకు నచ్చడం లేదు.