YouTube channel subscription banner header

ప‌ది రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయ‌డం ఏంటీ..? ముఖేష్‌కుమార్ మీనా ఆర్డ‌ర్స్‌పై ఉండ‌వ‌ల్లి సందేహం

Published on

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో పోలైన ఓట్ల‌కు, లెక్కించిన ఓట్ల‌కు చాలా వ్య‌త్యాసం ఉంద‌ని, మహారాష్ట్రకు చెందిన ఓట్ ఫర్ డెమోక్రసీ సంస్థ పోలైన ఓట్లకి లెక్కించిన ఓట్లకి 12.54 శాతం తేడా ఉందని ప్రకటించిందని, మ‌రి దీనిపై ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేదని చంద్ర‌బాబును ప్ర‌శ్నించారు మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్‌. మార్గ‌ద‌ర్శి కేసుపై నిర్వ‌హించిన ప్రెస్‌మీట్‌లో ఈ విష‌యాల‌ను మాట్లాడారు. ఏపీలో 12.54 శాతం, ప‌క్క‌నున్న ఒడిశాలో 12.48 శాతం తేడా ఉంద‌ని ఓట్ ఫ‌ర్ డెమోక్ర‌సీ సంస్థ‌ పెద్ద లిస్ట్ ఇచ్చింద‌న్నారు. అది విప‌రీతంగా స‌ర్క్యూలేట్ అవుతుంద‌న్నారు. చంద్ర‌బాబు ఇందులో ఎక్స్‌ప‌ర్ట్‌. ఈవీఎంల‌ను త‌ప్పుబ‌ట్టింది మొద‌ట చంద్ర‌బాబు నాయుడేన‌ని, దీనిపై ఆయ‌న వెంట‌నే స్పందించాల‌ని డిమాండ్ చేశారు. ఓట్ ఫ‌ర్ డెమోక్ర‌సీ సంస్థ‌లో ఎవ‌రున్నార‌ని చెక్ చేస్తే చాలామంది ప్ర‌ముఖులే ఉన్నార‌ని తేలింద‌న్నారు.

26-06-24 ఎన్నిక‌ల కౌంటింగ్ జ‌రిగిన 22 రోజుల త‌రువాత ఏపీ చీఫ్ ఎల‌క్ష‌న్ ఆఫీస‌ర్‌గా ఉన్న ముఖేష్‌కుమార్‌ మీనా ఒక ఆర్డ‌ర్ ఇచ్చార‌ని ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ చెప్పారు. ఓట్ల వివరాలు పది రోజుల్లోనే డిస్ట్రాయ్ చేయమని ఎన్నికల కమిషనర్ మీనా ఎందుకు ప్రకటించారో.. అని అనుమానం వ్య‌క్తం చేశారు. సెక్ష‌న్ 81 రిప్రజెంటేష‌న్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్ర‌కారం 45 రోజుల వ‌ర‌కు ఈవీఎంలు సుర‌క్షితంగా పెట్టి ఉంచాల‌న్నారు. ఎవ‌రైనా ఎల‌క్ష‌న్ పిటీష‌న్ వేస్తారేమో.. అవ‌న్నీ సుర‌క్షితంగా ఉండాల‌ని యాక్ట్ 45 రోజులు టైమ్ ఇచ్చింది. మ‌రి డిస్ట్రాయ్ చేయ‌మ‌ని మీనా ఎలా ఆర్డ‌ర్ ఇచ్చారని ప్ర‌శ్నించారు.

వైసీపీ నేత బాలినేని శ్రీ‌నివాసులురెడ్డి పిటీష‌న్‌పై స్పందించిన ఈసీ.. మాక్ పోలింగ్ నిర్వ‌హించ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు ఉండ‌వ‌ల్లి. ఆ రోజున పోలింగ్ అయిన ఓట్ల‌ను లెక్కించాల‌ని పిటీష‌న్ వేస్తే మాక్ పోలింగ్ ఏంటీ..?. వీవీ ప్యాట్‌ల‌లో వ‌చ్చిన స్లిప్పులు డిస్ట్రాయ్ చేశారంట‌.. 45 రోజుల స‌మయం యాక్ట్ ఇచ్చిన‌ప్పుడు డిస్ట్రాయ్ చేసే అధికారం ఎవ‌రిచ్చారు..? ఒక‌వేళ యాక్ట్ ఏమైనా మారిందా..? అని ఎన్నిక‌ల క‌మిష‌న్‌ను నిల‌దీశారు. ఓట్ ఫర్ డెమోక్రసీ చెప్పిన వివరాలు తప్పయితే తప్పని చంద్రబాబు ప్రకటించాల‌ని ఉండవల్లి డిమాండ్‌ చేశారు.‌‌

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...