YouTube channel subscription banner header

హైడ్రా పర్మిషన్ తప్పనిసరి!

Published on

తెలంగాణలో హైడ్రా వ్య‌వ‌స్థ‌ సంచలనంగా మారింది. హైదరాబాద్‌ రియల్టర్లకు ఇప్పుడు హైడ్రా గుబులు పుట్టిస్తోంది. చెరువుల పరిరక్షణే లక్ష్యంగా ఏర్పాటైన హైడ్రా.. FTL, బఫర్ జోన్‌ పరిధిలో నిర్మించిన నిర్మాణాలను కూల్చేస్తూ హడలెత్తిస్తోంది. దీని ప్రభావంతో హైదరాబాద్‌లో ఇళ్ల స్థలాలు, ఇంటి కొనుగోళ్లు, అమ్మకాలు పడిపోయాయి. ఫలితంగా రిజిస్ట్రేషన్లు తగ్గిపోయి.. ప్రభుత్వానికి ఆదాయం కూడా పడిపోయింది.

ఐతే తాజాగా రేవంత్ సర్కార్‌ హైడ్రా విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్తగా నిర్మించే భవనాలకు హైడ్రా పర్మిషన్‌ తప్పనిసరి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇళ్ల కొనుగోలుదారులకు భరోసా కల్పించేందుకు అనుమతుల జారీలో హైడ్రాను భాగస్వామ్యం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇకపై హైడ్రా నుంచి నో అబ్జక్షన్ సర్టిఫికెట్(NOC) ఉంటేనే నిర్మాణాలు చేపట్టేలా నిబంధనల్లో మార్పులు చేస్తారని సమాచారం. అక్రమంగా నిర్మించిన భవనాలకు ఇంటి నెంబర్‌, నల్లా, విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

రేవంత్‌ సర్కార్‌ ఎప్పటికప్పుడు హైడ్రాను బలోపేతం చేస్తోంది. తాజాగా హైడ్రాకు అదనంగా సిబ్బందిని కేటాయించింది ప్రభుత్వం. 15 మంది సీఐ స్థాయి, 8 మంది SI స్థాయి అధికారులను హైడ్రాకు కేటాయించింది. ఈ మేరకు డిప్యూటేషన్‌పై అధికారులను కేటాయిస్తూ డీజీపీ ఆఫీసు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఆక్రమణలను పరిశీలిస్తూ కూల్చివేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. తాజాగా సిబ్బంది కేటాయింపుతో కూల్చివేతలు మరింత వేగవంతం కానున్నాయి.

Latest articles

ఫిరాయింపు ఎమ్మెల్యేలను భయపెడుతున్న పాల్..

తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వారిని అనర్హులుగా ప్రకటించాలని, ఆయా స్థానాలకు ఉప...

కర్నూలుకి మహర్దశ పట్టేనా..?

ఏపీ రాజధాని విషయంలో అమరావతి, విశాఖ మధ్య వాదులాట జరుగుతుందే కానీ.. ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని కర్నూలుకి...

జగన్ లేఖలతో కదలిక వస్తుందా..?

తిరుమల వ్యవహారంపై వైసీపీ అధినేత జగన్ ప్రధాని నరేంద్రమోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాశారు. ఏపీ సీఎం...

హైడ్రా కూల్చివేతలతో తీవ్ర గందరగోళం..

హైడ్రా కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం తగ్గేది లేదంటోంది. హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, హైడ్రాకు...